Ram Charan: రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఎవరితో? - వైరల్ అవుతోన్న ఆ వార్తల్లో నిజమెంత?
Trivikram Srinivas: రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తర్వాత మూవీ ఎవరితో చేయబోతున్నారనే దానిపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ram Charan Next Movie With Trivikram Srinivas: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తర్వాత మూవీ ఎవరితో చేయబోతున్నారనే దానిపై ఇప్పటి నుంచే స్పెషల్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ డైరెక్టర్‌తో చరణ్..
రామ్ చరణ్ తన తర్వాత మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వెంకీతో త్రివిక్రమ్ ఓ మూవీ ప్లాన్ చేస్తుండగా అది పూర్తైన తర్వాత చరణ్‌తో మూవీ ట్రాక్ ఎక్కిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని.. ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. చరణ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద మరో హిట్ ఖాయమంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: కోపంగా చూడొద్దలా.. పేలబోయే ఫిరంగిలా.. - 'హరిహర వీరమల్లు' నుంచి 'తారా తారా' సాంగ్ అదుర్స్
పెద్ది షూటింగ్ అప్డేట్
ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథాంశంగా 'పెద్ది' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ వేరే లెవల్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తి కాగా.. కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. రామ్ చరణ్, దివ్యేందు శర్మలతో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దీనిపై సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఓ భారీ విలేజ్ సెట్ వేశారు.
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ మూవీ తర్వాత చరణ్ సుకుమార్‌తో ఓ మూవీ కూడా చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో పాటే త్రివిక్రమ్ మూవీ కూడా ట్రాక్‌లోకి రానుందనే టాక్ వినిపిస్తోంది.
వెంకీతో త్రివిక్రమ్!
ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. 'గుంటూరు కారం' తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్‌తో మైథలాజికల్ మూవీ చేయాల్సి ఉండగా.. అది కాస్త బ్రేక్ పడింది. బన్నీ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ వెంకీతో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్ 6న ఈ మూవీపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సప్తసాగరాలు దాటి ఫేం 'రుక్మిణి వసంత్' హీరోయిన్‌గా చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత చరణ్‌తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందనేది లేటెస్ట్ బజ్.





















