Ram Charan: ట్రైన్‌లో రామ్ చరణ్ ఫైట్... 'పెద్ది' కోసం ఎవరూ చేయని రిస్క్!
Peddi Shooting Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హైదరాబాద్ సిటీలో ఉన్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హీరో మీద భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
భారీ ట్రైన్ సెట్... యాక్షన్‌లో రిస్క్ ఎక్కువ!
Peddi Shooting Update: 'పెద్ది' సినిమా కోసం హైదరాబాద్ సిటీలో భారీ ట్రైన్ సెట్ ఒకటి వేశారు. ప్రస్తుతం అందులో చిత్రీకరణ జరుగుతుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయనటువంటి హై - ఆక్టెన్స్, హై - రిస్క్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
రామ్ చరణ్ సహా కొంత మంది కీలక తారాగణం మీద ఈ యాక్షన్ సీన్ తీస్తున్నారు. రేపటితో (జూన్ 19, బుధవారం)తో 'పెద్ది' తాజా షెడ్యూల్ ముగుస్తుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అయ్యాయని తెలిసింది. ఆ వివరాలు కిందనున్న లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
Also Read రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ డీల్ క్లోజ్... ఆల్రెడీ సెంచరీ దాటించిన గ్లోబల్ స్టార్
View this post on Instagram
ఇప్పటి వరకు జాన్వి షూటింగ్ చేసింది తక్కువే!
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఈ సినిమా షూటింగ్ కోసం ఆవిడ హైదరాబాద్ వచ్చి వెళ్లారు. అయితే ఎక్కువ రోజులు ఉండలేదు. ఈ సినిమా కోసం జాన్వి కపూర్ షూటింగ్ చేసిన డేస్ తక్కువ. హీరో మీద భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేసిన తర్వాత టాకీ పార్ట్, హీరో హీరోయిన్ల మీద రొమాంటిక్ సీన్స్ తీయాలని ప్లాన్ చేశారట బుచ్చిబాబు.
Also Read: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాటలు ఇవ్వవలసి ఉంది. ఈ లోపు మిగతా పార్ట్ షూట్ చేసేలా దర్శకుడు ప్లాన్ చేశారట. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'పెద్ది' సినిమాలో సీనియర్ కథానాయకుడు జగపతి బాబు, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, నటుడు అర్జున్ అంబటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.





















