Peddi First Single: 'చికిరి' మీనింగ్ చెప్పారోచ్... పెద్ది ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది... రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్
Ram Charan Peddi Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'లో ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చింది. 'చికిరి'కి మీనింగ్ ఏమిటో చెప్పేశారు. ఇంతకీ, ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసా?

What Is Chikiri?: చికిరి అంటే ఏమిటి? కొన్ని గంటలుగా మెగా ఫ్యాన్స్ అందరిలో ఆ పదం మీద ఆసక్తి నెలకొంది. 'వాట్ ఈజ్ చికిరి?' అనేది వైరల్ అయ్యింది. అందుకు కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) లేటెస్ట్ సినిమా పెద్ది (Peddi Movie). 'ఉప్పెన' వంటి వందకోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మొదటి పాట 'చికిరి'. ఆ పదానికి అర్థం ఏమిటో చెప్పారు.
'చికిరి' మీనింగ్ ఏమిటంటే?
Chikiri Meaning Explained: 'చికిరి' పాటను రామ్ చరణ్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ మీద తెరకెక్కించారు. వాళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ పాటను మోహిత్ చౌహన్ పాడారు. ఈ పాట కోసం ఏఆర్ రెహమాన్, మోహిత్ మీద స్పెషల్ వీడియో షూట్ చేశారు బుచ్చిబాబు సానా. 'ఉప్పెన'లో మొదటి పాట కోసం ఆయన ఈ విధమైన వీడియో షూట్ చేసిన సంగతి తెలిసిందే.
కొండల్లో ఉంటున్న హీరో రామ్ చరణ్ తొలిసారి హీరోయిన్ జాన్వీని చూసే సందర్భంలో వచ్చే పాట 'చికిరి' అని బుచ్చిబాబు వివరించారు. ఆ పాటకు బాణీ కోసం రెహమాన్‌కు సందర్భాన్ని వివరించేటప్పుడు 'కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి' అని చెబుతారు. అప్పుడు 'చికిరి' అంటే ఏమిటి? అని రెహమాన్ అడుగుతారు. 'వాళ్ళ ఊరిలో ఆడపిల్లను ముద్దుగా, ప్రేమగా, అందంగా 'చికిరి' అని పిలుస్తారు' అని చెప్పారు బుచ్చిబాబు. ఆ చికిరి పదం మీద పాట చేశారు రెహమాన్. ఆ పాటను నవంబర్ 7న పాటను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
Also Read: రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూసినోళ్లు ఏం చెబుతున్నారంటే?
View this post on Instagram
'పెద్ది' షూటింగ్ 60 శాతం పూర్తి...
రామ్ చరణ్ బర్త్ డేకి విడుదల!
Peddi Shooting Status Update: 'పెద్ది' చిత్రీకరణ 60 శాతానికి పైగా పూర్తి అయ్యింది. ఇటీవల శ్రీలంకలో ఒక సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర బృందం హైదరాబాద్ తిరిగి వచ్చింది. డిసెంబర్ నెలాఖరు లేదంటే జనవరి అయ్యేసరికి చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యేలా ప్లాన్ చేయమని దర్శక నిర్మాతలకు రామ్ చరణ్ చెప్పారట. ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమా రిలీజ్ చేయనున్నారు.
Also Read: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రొడక్షన్ హౌస్ సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు జగపతి బాబు, 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, అర్జున్ అంబటి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్.





















