అన్వేషించండి

Ram Charan : రామ్ చరణ్‌కు గాయం? - పెద్ది షూటింగ్‌కు బ్రేక్!

Ram Charan Injury : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు పెద్ది షూటింగ్ సెట్‌లో గాయమైనట్లు తెలుస్తోంది. ఆయన కంటికి గాయం కాగా... అది చిన్నదేనని రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.

Ram Charan Injured In Peddi Shooting : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా... చిన్న చిన్న సీన్స్ ఓ సాంగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజా షూటింగ్‌లో హీరో రామ్ చరణ్‌కు గాయమైనట్లు తెలుస్తోంది.

ఆయన కంటికి స్వల్ప గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అది చిన్న గాయమేనని... రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. దీంతో షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చరణ్‌తో కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఓ స్పెషల్ సాంగ్ సైతం షూటింగ్ చేయబోతున్నారట. 

Also Read : అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ - ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ ఎంట్రీకి రెడీయేనా?

స్పెషల్ సాంగ్ పెండింగ్

చెప్పిన టైంకే మూవీ రిలీజ్ చేసేందుకు టీం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోసారి వాయిదా పడుతుందంటూ వస్తోన్న రూమర్స్‌కు ఓవర్సీస్ బుకింగ్ డేట్‌తో మేకర్స్ చెక్ పెట్టారు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 27 (శుక్రవారం) నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అనౌన్స్ చేశారు. ఇక అదే రోజున మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్‌గా టీజర్ సైతం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధం అవుతున్నారు.

కొన్ని సీన్స్, స్పెషల్ సాంగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్ సరసన మృణాల్ ఠాకూర్ ఈ పాటలో నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చరణ్‌కు గాయం కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది.

సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget