అన్వేషించండి

Game Changer Movie: 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి మరో సీన్‌ లీక్‌ - ఎయిర్‌ పోర్టులో కీలక సన్నివేశం, సర్‌ప్రైజ్‌ అవుతున్న ఫ్యాన్స్

Game Changer Laaked Video: రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్'‌ మూవీ నుంచి మరో వీడియో లీక్‌ అయ్యింది. ఇది మూవీలో విలన్స్, హీరోకి మధ్య ఎయిర్‌ పోర్టు బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఓ కీలక సన్నివేశంగా తెలుస్తోంది.

Ram Charan Game Changer Movie Leaked Video From Airport: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ మూవీతో బిజీగా ఉన్నారు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని రోజుల షూటింగ్‌ మిగిలి ఉందని ఇటీవల భారతీయుడు 2 మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్‌ శంకర్‌ వెల్లడించారు. ఇప్పటికే రామ్ చరణ్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయినట్టు తెలుస్తోంది. అయితే భారతీయుడు 2 రిలీజ్‌ అయినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్‌ మొదలైంది. ఇండియన్‌ 2 మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో గేమ్‌ ఛేంజర్‌ మూవీ రిజల్ట్‌ ఎలా ఉండబోతుందా? అని అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ సెట్‌ నుంచి మూవీ వీడియో ఒకటి లీక్‌ అయ్యింది. అప్పటి నుంచి మూవీపై మంచి బజ్‌ నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. చూస్తుంటే ఇది క్లైమాక్స్‌ సీన్‌లా ఉంది. ఎయిర్‌పోర్టులో విమానాల మధ్య లోకేషన్‌ చాలా రిచ్‌గా ఉంది. 'గేమ్‌ ఛేంజర్‌' లీక్డ్‌ వీడియో ఓ నెటిజన్‌ నెట్టింట పోస్ట్‌ చేయగా ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే హీరో రామ్‌ చరణ్‌ విలన్‌కు మధ్య జరిగే ఓ కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. గేమ్‌ ఛేంజర్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Also Read: పవన్ 'ఓజీ'లో జానపద గాయనికి ఛాన్స్ - తెలుగు ఇండియన్ ఐడల్ 3 స్టేజిపై తమన్ ప్రకటన

ఈ వీడియో విలన్‌లు పోలిటిషయన్‌గా కనిపిస్తుండగా.. చరణ్‌ ప్రభుత్వ అధికారిగా సూటుబూటులో కనిపించాడు. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఈ సీన్‌ ఇంటెన్సిటీ, బ్యాగ్రౌండ్‌ చూసి ఖుష్‌ అవుతున్నారు. ఈ వీడియోపై ఫ్యాన్స్‌, నెటిజన్లు క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నటిస్తున్న చిత్రం కావడంతో గేమ్‌ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంచలన డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం, దిల్‌ రాజు వంటి అగ్రనిర్మాత ఈ సినిమాకు నిర్మిస్తుండటంతో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వస్తున్న లీక్డ్‌ ఫోటోలు, వీడియోలు మరింత ఆసక్తిని పెంచాయి.

అలా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ ముందు నుంచి స్లో స్లో షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే మూవీ షూటింగ్‌ పూర్తయిన మూవీ త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇప్పటి వరకు శంకర్‌ 'ఇండియన్‌ 2' మూవీ రిలీజ్ నేపథ్యంలో బిజీ అయిపోయారు. ఇక మూవీ రిలీజ్‌ అయ్యింది. ఇక గేమ్‌ ఛేంజర్‌పై ఫోకస్‌ పెట్టి చకచక పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఇక మూవీ అవుట్‌ పుట్‌ చూసి, పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి మూవీ రిలీజ్‌ డేట్‌ డిసైడ్‌ చేసి అనౌన్స్‌ చేయనున్నారు. ఇక ఈ ఏడాదిలోనే గేమ్‌ ఛేంజర్‌ని రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే మూవీ స్పష్టం చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ అంతా మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా లీకైన ఈ వీడియో మూవీపై మరింత ఆసక్తి పెంచింది.

Also Readబన్నీ వర్సెస్ సుకుమార్ - గొడవలతో 'పుష్ప 2' షూటింగ్ మళ్లీ వాయిదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget