Rakul Preet Singh: పెళ్లి తర్వాత జాకీ ఎలాంటి కండిషన్స్ పెట్టారు? - రకుల్ ఏం చెప్పిందంటే!
Rakul Preet Singh: పెళ్లి తర్వాత జాకీ ఎలాంటి కండిషన్స్ పెట్టారు అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె రిపోర్టర్ పశ్నపై అసహనం చూపిస్తూ ఇలా సమాధానం ఇచ్చింది.
Rakul Preet Singh Strong Reply to Reporter: రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో గతనెల ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌కు కొద్ది మంది బంధుమిత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మూడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఫిబ్రవరి 21, 2024లో పెళ్లిబంధంతో ఒక్కటైంది. ఇక పెళ్లి అనంతరం రకుల్ రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో మెరిసింది. భర్త కలిసి హాజరైన ఈ కార్యక్రమంలో రకుల్ పోట్టి బట్టల్లో హజరైంది. ఈ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడిన రకుల్‌కు రిపోర్టర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. పెళ్లి తర్వాత మీ డ్రెస్సింగ్‌పై అత్తింటి నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా? ఎక్స్‌పోజింగ్‌లో ఏమైనా కండషన్స్ పెట్టారా? అని ప్రశ్నించారు.
దీనికి రకుల్ స్పందిస్తూ తన భర్త అలాంటివాడు కాదని చెప్పింది. "లేదు నాకేవరు అలా చెప్పలేదు. పుట్టింట్లో అయినా, అత్తింట్లో అయినా నాకు నచ్చినట్లు ఉండేలా స్వేచ్ఛనిచ్చారు. నిజానికి అత్తింటి వారు కానీ, పుట్టింట్లో కానీ ఎవరూ అలా చెప్పరు. ఈ సమాజమే పెళ్లిని పెద్ద విషయంగా చూస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఒక సహజ ప్రక్రియగా భావిస్తే సరిపోతుంది. కానీ, ఈ విషయంలో ఎందుకు అందరు అమ్మాయిలనే ప్రశ్నిస్తారో అర్థం కాదు. ఇలాంటి అబ్బాయిలను ఎందుకు అడగరు. పెళ్లి తర్వాత ధగధగ మెరిసే షేర్వాణీలే ధరించాలని మగవాళ్లకు చెప్పగలరా? అడగలేరు కదా! మరి ఆడవాళ్ల విషయంలో మాత్రం ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెడతారు? కాలం మారింది. ఇప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటారు. ఎవరికి నచ్చనట్టుగా వారు బట్టలు వేసుకుంటారు" అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచింది.
పెళ్లి తర్వాత స్పెషల్ వీడియో వదిలిన రకుల్
కాగా పెళ్లి తర్వాత రకుల్, జాకీలు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. పెళ్లి ముందుకు ఈ జంట తమ వివాహ వేడుకకు సంబంధించిన హల్గి, మహెందీ ఇలా ప్రతి విషయాన్ని బయటకు రాకుండ చాలా గొప్యంత పాటించారు. పెళ్లి అనంతరం ఒక్కొక్కటిగా వారు ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ఈ క్రమంలో తమ పెళ్లికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. నువ్వు, నేను కాదు.. ఇక నుంచి మనం. అంటూ వీడియో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. దాంట్లో హల్దీ, సంగీత్, మెహందీ, పెళ్లికి సంబంధించి స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు ఈ వీడియోలో. జాకీ భగ్నానీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ తన సోదరులతో కలిసి నడుస్తూ వస్తున్న మూమెంట్ భలే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఇక ఈ వీడియోకి ‘బిన్ తెరీ’ పాటను యాడ్ చేశారు. ఆ పాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే? రకుల్ ప్రీత్ సింగ్ కోసం జాకీ భగ్నానీ ఆ పాటను స్వయంగా రాసి, కంపోజ్ చేశారు.