Rakul Preet Singh wedding: పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
Rakul Preet Singh Marriage: కొద్ది రోజులుగా మీడియాల్లో, సోషల్ మీడియాల్లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి హడావుడి, సంబరాలే కనిపిస్తున్నాయి. ఇప్పడు ఇండస్ట్రీ మొత్తం రకుల్ వివాహ వేడుకలో వాలిపోయింది.
Rakul Preet Singh Wedding: కొద్ది రోజులుగా మీడియాల్లో, సోషల్ మీడియాల్లో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి హడావుడి, సంబరాలే కనిపిస్తున్నాయి. ఇప్పడు ఇండస్ట్రీ మొత్తం రకుల్-జాకీ భగ్నానీ వివాహ వేడుకలో వాలిపోయింది. నేడు (ఫిబ్రవరి 21) బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది ఈ జంట. మూడేళ్ల ప్రేమయాణం అనంతరం ఫిబ్రవరి 21న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జాకీ భగ్నానీ, రకుల్ మెడలో మూడుమూళ్లు వేశాడు. గోవాలో జరిగిన వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వాదించారు.
పెళ్లి పనులు నుంచి వివాహ తంతు వరకు ఈ జంట చాలా గొప్యత పాటించింది. ఇప్పటి వరకు వీరి పెళ్లిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు కానీ, ఈ జంట హాడావుడి, హల్ది వేడుకకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాయి. దాంతో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం బయటకు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట తాజాగా తమ వివాహ బంధాన్ని సోషల్ మీడియా వేదికగా ఆఫీషియల్ చేసింది ఈ కొత్త జంట. తమ సోషల్ మీడియాలో వేదికగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి ఒక్కటయ్యామంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు.
Also Read: రకుల్ పెళ్లికి రాశీ ఖన్నా డుమ్మా - కారణం ఇదేనా?
తాజాగా రకుల్ తన పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ ఇక నువ్వు నా సొంతం.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. అంటూ పెళ్లి తేదీని కూడా మెన్షన్ చేసింది. హార్ట్ ఎమోజీని జతచేస్తూ తన భర్త జాకీ భగ్నానీని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం రకుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు బాలీవుడ్ స్టార్స్ అంతా గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానీ, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‍తో పాటు మరికొందరు సినీ సెలెబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు.
View this post on Instagram
రెండు సంప్రదాయాల్లో..
రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో పెళ్లి చేసుకోనున్నట్టు మొదటి నుంచి అందుతున్న సమాచారం. ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక జరిగినట్టు తాజాగా రిలీజైన పెళ్లి ఫొటోలు చూస్తుంటే అర్థమవుతుంది. గోవాలో జరిగిన వీరి గ్రాండ్ వెడ్డింగ్‌కి ఇరుకుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ ప్రముఖులు కోసం ముంబైలో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్‌ను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా కాగా రుకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. అప్పుడే తన ప్రేమను ఆఫీషియల్ కూడా చేసిది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.