అన్వేషించండి

Rakesh Varre: బ్యాగ్రౌండ్ లేకపోతే ఎవరూ పట్టించుకోరు, సెలబ్రటీలు రారు... 'జితేందర్ రెడ్డి' ప్రెస్‌మీట్‌లో రాకేష్ వర్రే ఫైర్

Jithender Reddy Movie: నవంబర్ 8న 'జితేందర్ రెడ్డి' థియేటర్లలోకి వస్తోంది. ఈ గురువారం (నవంబర్ 7న) పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో రాకేష్ వర్రే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అని గతంలో పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే చిన్న సినిమా తీసి చూడు దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకు వెళలా విడుదల చేసి చూడు అని యంగ్ హీరోలు చెబుతున్నారు. పేదలు సొంతిల్లు కట్టడం ఎంత కష్టమో చిన్న హీరోల సినిమా తీసి విడుదల చేయడం కూడా అంతే కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'క' విడుదల సమయంలో కిరణ్ అబ్బవరం, 'ధూం ధాం' విడుదలకు ముందు చేతన్ మద్దినేని, ఇప్పుడు జితేందర్ రెడ్డి కోసం రాకేష్ వర్రే... సినిమా విడుదల కోసం చాలా కష్టాలు పడ్డారని వాళ్ల మాటలను బట్టి అర్థమవుతుంది. 

చిన్న సినిమాలు చేయలేమంటున్న రాకేష్!
రెబల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి', 'బాహుబలి' సినిమాలలో రాకేష్ కీలక పాత్రలు చేశారు. ఆ తర్వాత 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాతో హీరోగానూ విజయం అందుకున్నారు. అయితే హీరోగా మరో సినిమా చేయడానికి ఆయనకు నాలుగేళ్ల సమయం పట్టింది. 'జితేందర్ రెడ్డి' సినిమాతో మరోసారి ఆయన ప్రేక్షకుల ముందుకు హీరోగా వస్తున్నారు. నవంబర్ 8న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా విలేకరుల సమావేశంలో రాకేష్ వర్రే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరని రాకేష్ వర్రే అంటున్నారు. సినిమా విడుదల చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. 'ఎవరికీ చెప్పొద్దు' సినిమా విజయం సాధించడంతో కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో తాను పేక మేడలు సినిమా ప్రొడ్యూస్ చేశానని, ఆ సినిమా విడుదల సమయంలో చాలా కష్టాలు పడ్డాను అని ఆయన తెలిపారు.
చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి సెలబ్రిటీలు రారు అని తాజాగా ఏర్పాటు చేసిన 'జితేందర్ రెడ్డి' విలేకరుల సమావేశంలో రాకేష్ వర్రే ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు ఎంతో మందికి తాను మెసేజ్ చేశానని కానీ అటు నుంచి స్పందన లేదని ఆయన తెలిపారు. సెలబ్రిటీలను నమ్ముకోవద్దని ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకువెళ్లే డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను నమ్ముకోమని తోటి ఫిలిం మేకర్లకు రాకేష్ వర్రే సలహా ఇచ్చారు.

Also Read: 'గేమ్ చేంజర్'తో ఇష్యూ లేకుండా రిలీజ్ డేట్ ఫిక్స్... సంక్రాంతికి వస్తున్న వెంకీ మామ


'ఎవరికీ చెప్పొద్దు' సినిమా తీసిన అనుభవంతో కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలని పేక మేడలు తీశానని, కానీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు. తనకు ఒక బ్రాండ్ వచ్చిన తరువాత మళ్లీ నిర్మాతగా సినిమాలు చేస్తానని చెప్పారు. 'జితేందర్ రెడ్డి' ప్రేక్షకుల కోసం ఎంతో పోరాడారని చనిపోయిన తన అన్న కోసం ఒక తమ్ముడు సినిమా తీయాలని తన దగ్గర రావడంతో ఈ సినిమా యాక్సెప్ట్ చేశానని, మే నెల నుంచి కష్టాలు పడితే ఇప్పటికి సినిమాను థియేటర్లలోకి తీసుకు రాగలుగుతున్నామని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రెటీలు రావాలంటే వాళ్లకు బోలెడు ఆబ్లిగేషన్స్ ఉంటాయని చెప్పారు. మరి ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Readకేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Donald Trump Going to be Win US Elections 2024 | అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి చేరువలో ట్రంప్ | ABPవీడియో: మా ఇంటికి దేవుడు వచ్చి టీ చేసిచ్చాడుఢిల్లీకి వెళ్తున్న పవన్ కళ్యాణ్, రీజన్ ఇదేనా?నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
US Election Elon Musk: గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
గెలిచింది ట్రంప్ - గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Prabhas: కథలు అద్భుతంగా రాస్తారా... అయితే ప్రభాస్ బంఫర్ ఆఫర్ మీలాంటి టాలెంటెడ్ రైటర్స్ కోసమే
కథలు అద్భుతంగా రాస్తారా... అయితే ప్రభాస్ బంఫర్ ఆఫర్ మీలాంటి టాలెంటెడ్ రైటర్స్ కోసమే
Embed widget