అన్వేషించండి

Rajinikanth Biopic: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ జర్నీ... వెండితెరపైకి రజనీకాంత్ ఆత్మకథ

Rajinikanth Biography: ప్రస్తుతం రజనీకాంత్ తన ఆత్మకథ రాస్తున్నారు. దానిని సినిమాగా వెండితెరపైకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారని కోలీవుడ్ ఖబర్. ఆ వివరాల్లోకి వెళితే...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రజనీకాంత్ ఆత్మకథ రాయడం, సినిమా ఆలోచనపై చర్చలు.
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' అక్టోబర్ 15న రాబోతోంది.
  • కమల్ హాసన్ నిర్మించే 'ధర్మన్'లో రజనీకాంత్ స్టైలిష్ డాక్టర్.
  • నెల్సన్ దర్శకత్వంలో కమల్, రజనీకాంత్ కలిసి మల్టీస్టారర్.

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన ఆత్మకథ (Rajinikanth Autobiography)ను రాసే పనిలో బిజీగా ఉన్నారని తెలిసింది. అంతే కాదు... దానిని ఫీచర్ ఫిల్మ్‌గా వెండితెరపైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ ఖబర్. ఆ వివరాల్లోకి వెళితే...

బస్ కండక్టర్ టు సూపర్ స్టార్!
రజనీకాంత్ గత కొంత కాలంగా ఆత్మకథను రాస్తున్నారు. అందులో ఓ సామాన్యుడి నుండి దేశంలో సూపర్ స్టార్లలో ఒకరిగా ఎదిగిన తన అసాధారణ ప్రయాణాన్ని, తన జీవితంలోని ఆసక్తికరమైన సంఘటనలు, చిరస్మరణీయ క్షణాలు, మధుర జ్ఞాపకాలు, భావోద్వేగ భరిత క్షణాలు అన్నీ ఉంటాయని సమాచారం. ఈ పుస్తకాన్ని సినిమాగా రూపొందించే చేసే విషయంపై తన సన్నిహితులతో రజనీకాంత్ చర్చలు జరుపుతున్నట్లు చెన్నై వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, తన బయోపిక్ గురించి ఇప్పటి వరకు సూపర్ స్టార్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

Also Read: Chiranjeevi - Gabbar Singh Ramesh - 'గబ్బర్ సింగ్' రమేష్‌కు 'మెగా'స్టార్ అండ... చికిత్సకు సాయం, కుటుంబ సభ్యులకు చెక్ అందజేత

Rajinikanth Upcoming Movies: రజనీకాంత్ రాబోయే సినిమాల విషయానికి వస్తే... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమా 'జైలర్'కు సీక్వెల్ 'జైలర్ 2' చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాలో విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు కీలక తారాగణం. 'జైలర్'లో నటించిన రమ్యకృష్ణ, యోగి బాబు, మీర్నా కూడా కనిపించనున్నారు. అంతే కాకుండా... 'జైలర్ 2'లో మోహన్ లాల్, హృతిక్ రోషన్, శివ రాజ్‌ కుమార్, విజయ్ సేతుపతి అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also ReadChennai Love Story Collections - చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

'జైలర్ 2' తర్వాత 'ధర్మన్' అని మరో యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నారు రజనీకాంత్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలోని ఆ సినిమా కొన్ని రోజుల క్రితం మొదలైంది. అందులో స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు సూపర్ స్టార్. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. సిమ్రాన్, రాశి ఖన్నా ముఖ్య తారాగణం. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. సోలో హీరోగా రెండు సినిమాలు కాకుండా... నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి మరో ముల్టీస్టారర్ (KHxRK Reunion) చేయనున్నారు.

Also ReadJana Nayagan Collections - 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Frequently Asked Questions

రజనీకాంత్ ప్రస్తుతం ఏ పనిలో బిజీగా ఉన్నారు?

రజనీకాంత్ తన ఆత్మకథను రాసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఓ సామాన్యుడి నుండి సూపర్ స్టార్‌గా మారిన తన అసాధారణ ప్రయాణాన్ని అందులో వివరిస్తున్నారు.

రజనీకాంత్ తన ఆత్మకథను సినిమాగా తీయాలని ఆలోచిస్తున్నారా?

అవును, రజనీకాంత్ తన ఆత్మకథను ఫీచర్ ఫిల్మ్‌గా వెండితెరపైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.

రజనీకాంత్ రాబోయే సినిమా 'జైలర్ 2' ఎప్పుడు విడుదలవుతుంది?

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'జైలర్ 2' ఈ ఏడాది అక్టోబర్ 15న విడుదల కానుంది. ఇందులో విద్యా బాలన్, ఎస్.జె. సూర్య వంటి వారు నటిస్తున్నారు.

రజనీకాంత్ తదుపరి సినిమా 'ధర్మన్' గురించి వివరాలు ఏమిటి?

'జైలర్ 2' తర్వాత రజనీకాంత్ 'ధర్మన్' అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తుండగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.

రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారా?

అవును, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒక మల్టీస్టారర్ (KHxRK Reunion) చేయనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget