అన్వేషించండి

Chiranjeevi: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు 'మెగా'స్టార్ అండ... చికిత్సకు సాయం, కుటుంబ సభ్యులకు చెక్ అందజేత

Gabbar Singh Ramesh Health Update: బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో నటుడు 'గబ్బర్ సింగ్' రమేష్ ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెగాస్టార్ చిరంజీవి నటుడు రమేష్‌ చికిత్సకు వెంటనే స్పందించారు.
  • ఆ కుటుంబానికి మూడు లక్షల చెక్కు, ఆరోగ్య పర్యవేక్షణ చేశారు.
  • నాగబాబు రెండు లక్షలు, ప్రభుత్వ పథకం సాయం కూడా అందించారు.

తోటి కళాకారులకు అండగా నిలబడటంలో, వాళ్ళ కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందు ఉండే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన మానవత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారు. 'గబ్బర్ సింగ్'తో పాటు పలు చిత్రాల్లో విలన్, కామెడీ రోల్స్ చేసి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ (Gabbar Singh Ramesh Actor) ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  సంగతి తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.

రమేష్ కుటుంబానికి మూడు లక్షల సాయం
అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు రమేష్ ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి తెలుసుకుంటున్నారు. అతని చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం చేస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

Also Read: Balakrishna - బాలయ్య ఆరోగ్యం కోసం భారీ హోమం... ప్రత్యేక పూజలు చేయిస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని

Chiranjeevi: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు 'మెగా'స్టార్ అండ... చికిత్సకు సాయం, కుటుంబ సభ్యులకు చెక్ అందజేత
రమేష్ కుటుంబ సభ్యులను చిరంజీవి పరామర్శించారు. చికిత్స ఖర్చులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి. అంతే కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని రమేష్ కుటుంబ సభ్యులకు చిరంజీవి హామీ ఇచ్చారు.

Also ReadChennai Love Story Collections - చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మెగా కుటుంబం నుంచి 'గబ్బర్ సింగ్' రమేష్ కుటుంబానికి మరో రెండు లక్షల రూపాయల సాయం అందింది. శనివారం (జూలీ 25న) నాగబాబు తన తరఫున రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. తోటి కళాకారుల పట్ల చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయత, బాధ్యతాభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచిందని రమేష్ కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు. సినీ కార్మికులు, నటీనటులు అవసరంలో ఉన్నప్పుడు చిరంజీవి ఎన్నో సందర్భాల్లో సహాయం అందించారు. 

Also ReadJana Nayagan Collections - 150 కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... మూడో రోజు కాస్త బెటర్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Frequently Asked Questions

నటుడు రమేష్‌కు ఏమైంది?

'గబ్బర్ సింగ్' రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు.

చిరంజీవి రమేష్‌కి ఎలా సహాయం చేశారు?

చిరంజీవి రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, చికిత్సకు అవసరమైన సహాయం అందించారు. ఆయన రమేష్ సతీమణికి మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

మెగా కుటుంబం నుండి రమేష్‌కు ఎంత ఆర్థిక సహాయం అందింది?

చిరంజీవి మూడు లక్షలు, నాగబాబు తన తరఫున మరో రెండు లక్షలు కలిపి మొత్తం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

రమేష్ చికిత్సకు సంబంధించి చిరంజీవి ఇంకేం హామీ ఇచ్చారు?

రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget