Rajendra Prasad: జయప్రద ఈజ్ బ్యాక్ - రాజేంద్ర ప్రసాద్‌తో ‘లవ్@65’, లేటు వయస్సులో ఘాటు ప్రేమ!
Rajendra Prasad: నట కిరిటీ, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ లేటు వయసులో ప్రేమలో పడ్డారట. అదీ కూడా అలనాటి హీరోయిన్‌తో. ఇదే విషయాన్నీ ఆయనను అడిగితే ప్రేమలో పడటానికి వయసుతో సంబంధం ఏంటీ? అంటున్నారు.
Rajendra Prasad Love At 65 First Look: నట కిరిటీ, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ లేటు వయసులో ప్రేమలో పడ్డారట. అదీ కూడా అలనాటి హీరోయిన్‌తో. ఇదే విషయాన్నీ ఆయనను అడిగితే ప్రేమలో పడటానికి వయసుతో సంబంధం ఏంటీ? ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ సమాధానం ఇస్తున్నారట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదలేండి.. రీల్ లైఫ్‌లో అట. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో పలు చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మరో కూడా ఓ సినిమా చేస్తున్నారు.
దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సదరు నిర్మాణ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘లవ్@65’ టైటిల్ ఖారరు చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌తో నటిస్తుండగా.. అలనాటి నటి జయప్రద మరో ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా మొత్తం వీరిద్దరి ప్రేమ చూట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. విఎన్ ఆదిత్య గతంలో మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కిచిన ఆయన చాలా గ్యాప్ తర్వాత లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా 'లవ్@65' తెరెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం.
View this post on Instagram
ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన చేయనున్నారు. కాగా ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ర చిత్రాలతో ఆకట్టుకున్న రాజేంద్ర ప్రసాద్ కమెడియన్‌గానూ అలరించారు. అలా నాలుగు దశాబ్ధాలుగా తన నటనతో వెండితెరపై అలరిస్తూ వస్తున్న ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అప్పుడప్పుడ ప్రధాన పాత్రల్లో మెరుస్తున్నారు. ఆ మధ్య ఓటీటీలోకి కూడా అడుగుపెట్టేశారు. సేనాపతి, కృష్ణరామ సహా పలు ఓటీటీ కంటెంట్‌తోనూ ఆడియన్స్‌ని మెప్పించారు. ఒకప్పడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన జయప్రద మదర్ రోల్స్‌లో మెప్పించారు. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాజకియాల్లోకి అడుగుపెట్టారు. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న ఆమె మళ్లీ చాలా గ్యాప్ తర్వాత 'లవ్@65'తో మరోసారివ వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు.