అన్వేషించండి

సూపర్‌ స్టార్‌ కొడుకైనా.. నటీనటులకు టీ పెట్టడం, ప్రొడక్షన్‌ బాయ్‌గా కష్టాలు తప్పలేదు - ఈ హీరో ఎవరో తెలుసా?

ఫేం, బ్యాగ్రౌండ్‌ ఉన్న ఇండస్ట్రీలో ఈ హీరోకి కష్టాలు తప్పలేదు. చివరికి ప్రొడక్షన్‌ బాయ్‌ అవతారం ఎత్తాడు. సినిమా సెట్‌లో నటీనటులకు టీ పెట్టాడు.  ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఆయనో సూపర్‌ స్టార్‌ కొడుకు. తండ్రి నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. అరడుగుల అందగాడు.. హీరోకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. నటన పరంగానూ తండ్రికి తగ్గ తనయుడే. అన్నీ ఉన్న ఈ హీరోకు లక్‌ మాత్రం అమడదూరంలోనే ఉంది. అందుకే మెగాస్టార్‌ తనయుడైన చెప్పుకొదగ్గ పెద్ద హిట్‌ లేదు. వరుస ప్లాప్స్‌, డిజాస్టర్స్‌తో డిలా పడ్డాడు. ఫేం, బ్యాగ్రౌండ్‌ ఉన్న ఇండస్ట్రీలో ఈ హీరోకి కష్టాలు తప్పలేదు. చివరికి ప్రొడక్షన్‌ బాయ్‌ అవతారం ఎత్తాడు. సినిమా సెట్‌లో నటీనటులకు టీ పెట్టాడు.  ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. దాదాపు 60కిపైగా సినిమాలు చేసినా డిజాస్టర్‌ హీరోగా మిగిలిపోయాడు. అయినా.. ఈ హీరో వందల కోట్ల నెట్‌వర్త్‌తో ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ ఈయన ఎవరో గుర్తుపట్టారా? అయితే అతనెవరూ, ఆయనేందుకు టీ బాయ్‌గా పనిచేశాడో ఇక్కడ తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో అడుగుపెట్టాలండే మొదట గట్టి బ్యాగ్రౌండ్‌ ఉండాలి. అది ఈ హీరోకు పుష్కలంగా ఉంది. స్టార్‌ కిడ్‌గా ఫస్ట్‌ ఆఫర్‌ అందుకున్నాడు. అదీ యావరేజ్‌ టాక్‌ ఇచ్చింది. అయినా తండ్రి పాపులారిటీతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్లు అందుకున్నాడు. అలా ఎనిమిది సినిమాల్లో హీరోగా చేశాడు. అవన్నీ వరుసగా పరాజయం పొందాయి. వచ్చిరాగానే ఇండస్ట్రీలో డిజాస్టర్‌ హీరోగా మిగిలిపోయాడు. అలా తన కెరీర్‌లో ఏకంగా 29 ఫ్లాప్స్‌ చూసిన మెగాస్టార్‌ కొడుకు ప్రస్తుతం నికర ఆస్తి విలువ రూ. 280 కోట్లు. ఆ హీరో ఎవరో మరెవరో కాదు అభిషేక్ బచ్చన్. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట వారసుడు అభిషేక్ బచ్చన్ గురించి మనందరికి తెలిసిందే. కానీ ఆయన వ్యక్తిగత జీవితం పెద్దగా ఎవరికి పరిచయం లేదు. 29 ఫ్లాప్స్ తర్వాత ఇటీవలే ఓటీటీ సినిమాతో ఆకట్టుకున్న అభిషేక్  ఓ ఇంటర్య్వూలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 

ప్రారంభంలోనే వరుసగా 8 ప్లాప్స్‌

అమితాబ్ బచ్చన్‌ నట వారసుడిగా  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ 'రెఫ్యూజీ' సినిమాతో బాలీవుడ్‌ ఆరంగేట్రం చేశాడు.  వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు జేపీ దత్తా తెరకెక్కించారు. ఈ మూవీలో అభిషేక్‌కు జోడిగా కరీనా కపూర్‌ నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ, నటీనటులకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ నటించిన 8 సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి. అలా వరుస డిజాస్టర్స్‌ చూసిన అభిషేక్‌ ధూమ్‌ సినిమా ఫస్ట్‌ హిట్‌ ఇచ్చింది. కానీ ఇది మల్టీస్టారర్‌ మూవీ కావడం అభిషేక్‌కు పెద్దగా క్రెడిట్‌ దక్కలేదు. ఇందులో అభిషేక్‌తో పాటు  జాన్ అబ్రహం, ఉదయ్ చోప్రాలు కూడా నటించారు.ఆ తర్వాత బంటీ ఔర్ బబ్లీ మూవీతో అభిషేక్ సోలో హిట్‌ కొట్టాడు. 2005లో విడుదలైన ఈ చిత్రంలో రాణి ముఖర్జీ హీరోయిన్‌. ఈ చిత్రంలోనే ఆయన తండ్రి అమితాబ్‌, భార్య ఐశ్వర్య రాయ్‌లు ఓ సాంగ్‌లో నటించారు. అదే కజ్‌రారే కజ్‌రారే సాంగ్‌. ఈ సాంగ్‌ భారీ హిట్‌ అయ్యింది. 


సూపర్‌ స్టార్‌ కొడుకైనా.. నటీనటులకు టీ పెట్టడం, ప్రొడక్షన్‌ బాయ్‌గా కష్టాలు తప్పలేదు - ఈ హీరో ఎవరో తెలుసా?

నటీనటులకు టీ పెట్టాను..

ఓ ఇంటర్య్వూలో అభిషేక్‌ మాట్లాడుతూ.. ఒకానోక టైంలో తన ఫ్యామిలీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొందని, దాంతో చదువు మధ్యలో ఆపేసి తండ్రికి సహాయం నిలబడ్డానని చెప్పాడు. "అప్పట్లో నాన్న ఓ కంపెనీ పెట్టాడు. అది నష్టాలు చూపించింది. అందులో ఆయన చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కసారిగా మా కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సమయంలో నా చదువుకంటే నాన్నను ఆదుకోవాలని ఎక్కువగా అనిపించింది. అందుకే చదువుకు గ్యాప్‌ ఇచ్చి ప్రొడక్షన్ బాయ్‌గా చేరాను. సినిమా సెట్స్‌లో నటీనటులకు టీ పెట్టేవాడిని. తర్వాత ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాను" అంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు 60 సినిమాల్లో నటించిన అభిషేక్ బచ్చన్ సుమారు 38 ఫ్లాప్స్ చూశాడు. అతడి కెరీర్‌లో భారీ హిట్స్ ఉన్న అందులో ఎక్కువగా మల్టీస్టార్‌ సినిమాలే ఉండటం గమనార్హం. 

అభిషేక్‌ని నిలబెట్టిన ఓటీటీ..

ఆ తర్వాత అభిషేక్‌ ఐశ్వర్యను పెళ్లాడాడు. అనంతరం పలు చిత్రాల్లో నటించిన అవి బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. ఇక నటనకు బ్రేక్‌ ఇచ్చిన అభిషేక్‌ తన 23 ఏళ్ల సినీ కెరీర్‌లో 29 ఫ్లాప్ల్ చూశాడు. రీఎంట్రీలో అతడు వరుసగా హిట్‌ అందుకున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్, ధూమ్ 2, ధూమ్ 3, హౌజ్‌ఫుల్ 3, దోస్తానా సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ ఇవన్నీ మల్టీస్టారర్‌ చిత్రాలే కావడం గమనార్హం. ఇక 2020లో మాత్రం బీత్ ఇంటు ది షాడోస్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ డిజిటల్‌లో తొలి హిట్ అందుకున్నాడు. ఇందులో నటన పరంగా అభిషేక్‌కు వందకు వంద మార్కులు పడ్డాయి.

ఆ వెంటనే 'ది బిగ్ బుల్', 'దస్వీ', 'బాబ్ బిస్వాస్' సినిమాలతో వరుసగా ఓటీటీలో అలరించాడు. అదే జోష్‌లో ఘూమర్ చిత్రంతో నటించాడు. థియేటర్లో విడుదలైన ఈ సినిమా అభిషేక్‌కు మరో భారీ డిజాస్టర్‌ ఇచ్చింది. అలా కెరీర్‌ పరంగా పెద్ద సక్సెస్‌ లేని హీరో ఆస్తులు మాత్రం బాగానే కూడబెట్టాడట. ప్రస్తుతం అభిషేక్‌ నికర ఆస్తి విలువ రూ. 280 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఇవి అతడు సొంతంగా సంపాదించిన ఆస్తులు. పలు నివేదికల ప్రకారం అభిషేక్ బచ్చన్ ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ఈ లెక్కన అతడు నెలకు దాదాపుగా రూ. 2 కోట్లు సంపాదిస్తున్నాడట. అంతేకాదు అభిషేక్‌ కొనుగోలు చేసిన ప్రో కబడ్డీ లీగ్ పింక్ పాంథర్స్‌ విలువ రూ. 100 కోట్లు అని ఉంటుందని సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Embed widget