Rajamouli: బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూసేశా - స్వీటీ, షారుఖ్ మూవీస్‌పై రాజమౌళి రివ్యూ ఇది!
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి విడుదలైన ‘మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి’, ‘జవాన్’ సినిమాలను ఒకేరోజు చూసి, తన రివ్యులను అందించారు.
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తాజాగా విడుదలైన రెండు సినిమాలను ఒకేరోజు చూసి, తన రివ్యులను అందించారు. అంతే కాకుండా చాలాకాలం తర్వాత ఒకేరోజు రెండు సినిమాలను చూశానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మామూలుగా ప్రతీ శుక్రవారం ఒకట్రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడడం సహజమే. కానీ ఈవారం మాత్రం రెండు భారీ అంచనాలు ఉన్న సినిమాలు గురువారం రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘జవాన్’. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్‌కు చెందినవే అయినా.. ప్రేక్షకుల్లో మాత్రం ఈ రెండిటిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘జవాన్’ చిత్రాలు విడుదలయిన మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్‌ను అందుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు.. ఈ రెండు సినిమాలపై తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. తాజాగా రాజమౌళి కూడా ఈ రెండు చిత్రాలను చూసి సోషల్ మీడియా ద్వారా తన రివ్యూను బయటపెట్టారు.
స్వీటీపై రాజమౌళి ప్రశంసల జల్లు..
తెలుగులో రాజమౌళికి అత్యంత ఇష్టమైన హీరోయిన్ అనుష్క అని ఇప్పటికీ పలు సందర్బాల్లో బయటపెట్టారు. అలాంటి అనుష్క.. గత కొన్నేళ్లుగా సినిమాల్లో యాక్టివ్‌గా ఉండడం లేదు. ఈ భామ చాలాకాలం తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని వెంటనే చూసి తన రివ్యూను అందించారు. ‘స్వీటీ ఎప్పటిలాగా చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. నవీన్ పోలిశెట్టి ఎంతో ఫన్‌ను అందించి నవ్వులు పూయించాడు. ఈ సక్సెస్‌ను అందుకున్నందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీమ్‌కు కంగ్రాట్స్. ఇలాంటి సెన్సిటివ్ అంశాన్ని సరదాగా హ్యాండిల్ చేసినందుకు మహేశ్ బాబుకు అభినందనలు’ అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రాజమౌళి.
షారుఖ్‌ను అలా అనడం కరెక్టే..
ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మాత్రమే కాదు.. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రాన్ని కూడా వీక్షించారు రాజమౌళి. చూడడం మాత్రమే కాకుండా షారుఖ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇందుకే షారుఖ్ ఖాన్‌ను బాక్సాఫీస్ బాద్‌షా అంటారు. ఇది ఒక భూకంపంలాంటి ఓపెనింగ్. నార్త్‌లో కూడా నీ సక్సెస్‌ను కొనసాగిస్తున్నందుకు కంగ్రాట్స్ అట్లీ. ఇంత అద్బుతమైన సక్సెస్ అందుకున్నందుకు జవాన్ టీమ్‌కు కంగ్రాట్స్’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఎప్పుడూ తన సినిమాలు, తన ప్రాజెక్ట్స్‌తోనే ఎక్కువ బిజీగా ఉండే రాజమౌళి.. చాలాకాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూడడం, వాటి గురించి పాజిటివ్ రివ్యూలు పోస్ట్ చేయడం బాగుంది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దర్శక ధీరుడు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఎలాగైనా ఈ సినిమాలు చూడాల్సిందే అని మరికొందరు ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: కంగనా రనౌత్ చెంప పగలగొట్టాలని ఉంది, పాకిస్థానీ నటి షాకింగ్ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial