News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Nausheen Shah: కంగనా రనౌత్ చెంప పగలగొట్టాలని ఉంది, పాకిస్థానీ నటి షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాపై పాకిస్థానీ నటి నౌషీన్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చెంప పగలగొట్టాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పాక్‌ గురించి అడ్డగోలుగా మాట్లాడుతుందని మండిపడింది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై పాక్‌ నటి నౌషీన్‌ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ గురించి ఏమాత్రం గురించి అవగాహన లేకుండా, అడ్డగోలుగా మాట్లాడుతుందని మండిపడింది.  ఆమెకు ఇతర దేశాల పట్ల ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ‘మోమిన్ సాకిబ్‌తో హద్ కర్ ది షో’లో పాల్గొన్న నౌషీన్‌,  కంగనాపై తనకున్న కోపాన్ని అంతా బయటపెట్టింది.

కంగనా చెంప పగలగొట్టాలని ఉంది- పాక్ నటి

టీవీ షోలో భాగంగా బాలీవుడ్ సార్స్ లో ఎవరినైనా కలవాలని ఉందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, నౌషీన్ ఏ మాత్రం ఆలోచించకుండా కంగనాను కలవాలని ఉందని చెప్పింది. అంతేకాదు, కలవగానే ఆమె చెంప పగలగొట్టాలని ఉందని వెల్లడించింది. “నాకు బాలీవుడ్ నటులలో కంగనా రనౌత్ ను కలవాలని ఉంది. కలవగానే చెంప చెల్లుమనిపించాలని ఉంది. ఆమె పాకిస్థాన్ గురించి, పాక్ సైన్యం గురించి చాలా చెత్తగా మాట్లాడుతుంది. పాకిస్థాన్‌లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని లేనిపోని విషయాలు ప్రచారం చేస్తోంది. పాకిస్థాన్ సైన్యం గురించి ఆమెకు ఏం తెలుసు? పాక్ ఏజెన్సీల గురించి ఏం తెలుసు? పాక్ సైన్యానికి సంబంధించిన విషయాలు, ఏజెన్సీల విషయాలు ఏమాత్రం బయటకు తెలియదు. కానీ, మన రహస్యాల గురించి ఆమె చాలా మాట్లాడుతుంది. చాలా చెత్తగా మాట్లాడుతుంది. నిజానికి ఆమెకు ఎలాంటి జ్ఞానం లేదు. అయినా, ఉన్నట్లు మాట్లాడుతోంది. ఇకనైనా పాక్ గురించి మాట్లాడ్డం మానేసి, మీ సొంత దేశం గురించి, మీ నటన గురించి, మీ మాజీ బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కంగనాపై నౌషీన్ ప్రశంసలు

అటు కంగనాపై నౌషీన్ ప్రశంసలు కూడా కురిపించింది. “కంగనా నిజానికి అద్భుతమైన నటి. అందంగా ఉంటుంది. కానీ, ఇతర వ్యక్తులను, దేశాలను గౌరవించడం విషయానికి వస్తే, ఆమె ప్రవర్తన చాలా చెత్తగా ఉంటుంది. తీవ్రవాదిలా మాట్లాడుతుంది" అని వెల్లడించింది.  ప్రస్తుతం నౌషీన్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కంగనా అభిమానులు నౌషీన్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఇండియా పేరు మార్పుపై స్పందించిన కంగనా

రీసెంట్ గా కంగనా, ఇండియా పేరు మార్పుపై స్పందించింది. భారత్​గా పేరు మార్చడానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. "కొంతమంది దేశం పేరు మార్చడాన్ని ఏదో చెడ్డ అంశంగా చూస్తున్నారు. కానీ, పేరు మార్పు తెలివైన అంశం. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.  ఇండియా అనే బానిస పేరును నుంచి విముక్తి పొందబోతున్నందుకు. జై భారత్"​ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

సెప్టెంబర్ 15న ‘చంద్రముఖి 2’ విడుదల  

ప్రస్తుతం కంగనా రనౌత్​ ‘చంద్రముఖి 2’లో నటిస్తోంది. ఇందులో నర్తకీమణిగా కనిపించబోతోంది.  గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘చంద్రముఖి’ చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతోంది. ఇందులో రాఘవ లారెన్స్​ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. యాక్షన్​-కామెడీ సీన్స్​ తో అలరించింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. సెప్టెంబర్ 15న ఈ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Also: 'జవాన్' హిట్టే కానీ 'బాహుబలి 2'ని బీట్ చేయలేదు - ప్రభాస్ రికార్డ్స్ సేఫ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 08 Sep 2023 04:15 PM (IST) Tags: Pakistan Kangana Ranaut Kangana Ranaut news Bharat INDIA Nausheen Shah Pakistani actress

ఇవి కూడా చూడండి

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!