News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

SSMB 29 Update : మహేష్ బాబుకు మూడు నెలల ట్రైనింగ్ - రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం ఉండాలిగా!

మహేశ్ బాబు సినిమా కోసం రాజమౌళి మూడు నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నారట. బాహుబలి, RRR చిత్రాల మాదిరిగానే వర్క్ షాప్స్ నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. 

FOLLOW US: 
Share:

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ కెరీర్ లో 29వ చిత్రం కానుంది. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ నిర్మిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న రూమర్ వచ్చినా, సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. ఇప్పుడు లేటెస్టుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మహేశ్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అడ్వంచర్ మూవీ చేయనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఇదొక గ్లోబ్ ట్రాటనింగ్ యాక్షన్ మూవీ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని జక్కన్న పేర్కొన్నారు. 'ఇండియానా జోన్స్' తరహాలో ఉంటుందని వెల్లడించారు. హై ఆక్టేన్ యాక్షన్తో కూడుకున్న సినిమా కావడంతో, హలీవుడ్ స్థాయిలో తెరకెక్కే చిత్రం కావడంతో మహేష్ లుక్ మరియు మేకోవర్ మీద దర్శకుడు ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. ఇందులో భాగంగా మహేష్ బాబును తన పాత్ర కోసం సిద్ధం చేసేందుకు రాజమౌళి మూడు నెలల పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న.. సినిమా మేకింగ్ లో కచ్చితంగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తారు. ట్రైనింగ్ సెషన్లు, వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి నటీనటులతో విస్తృతమైన రిహార్సల్స్, హార్డ్ వర్కౌట్స్ చేయిస్తుంటారు. 'బాహుబలి', RRR చిత్రాల మాదిరిగానే ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం కూడా ఇదే పద్దతి ఫాలో అవనున్నట్లు తెలుస్తోంది.

Also Read: రవీంద్రనాథ్ ఠాగూర్‌గా అనుపమ్ ఖేర్, ఫస్ట్ లుక్‌తో ఆశ్చర్యపరిచిన వర్సటైల్ యాక్టర్!

రాజమౌళి - మహేష్ బాబుల సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇండియాలో జరుగుతుందా లేదా విదేశాలలో జరుగుతుందా అనేది తెలియదు కానీ, కచ్చితంగా ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల షెడ్యూల్ ఖరారైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ట్రైనింగ్ షెడ్యూల్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అంటున్నారు.

మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి పండక్కి విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకొని, షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు డిసెంబర్ లో రాజమౌళి సినిమా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండటంతో, త్రివిక్రమ్ చిత్రాన్ని నవంబర్ కు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్దం చేశారట. అక్టోబర్ నెలాఖరు కల్లా ప్రిన్సిపల్ షూటింగ్ పూర్తి చేసి, నవంబర్ నెలను పాటల చిత్రీకరణకు కేటాయించాలని భావిస్తున్నారట.

రాజమౌళి - మహేష్ కాంబోలో సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. దాదాపు పుష్కర కాలం క్రితమే వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు.. ఇన్నాళ్లకు ఫలిస్తున్నందుకు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళినా, జక్కన్న సినిమా కాబట్టి ఎప్పుడు కంప్లీట్ అవుతుందనేది చెప్పలేం. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా పేర్కొనబడుతోంది. భారీ బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని ప్రేక్షకుల అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

Also Read: సమంత మైయోసిటిస్ ట్రీట్‌మెంట్‌ కోసం అన్ని కోట్లు ఖర్చు చేయనుందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 09 Jul 2023 10:43 PM (IST) Tags: Mahesh Babu SS Rajamouli SSMB29 Gunturu Karam Superstar Mahesh SSR Movie

ఇవి కూడా చూడండి

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

టాప్ స్టోరీస్

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్