అన్వేషించండి

Rajadhani Files: ‘రాజ‌ధాని ఫైల్స్‌’.. అంతా బాగానే ఉందిగానీ, అదొక్కటే తక్కువ - ప్రేక్షకుడికి టార్చరేనా?

Rajadhani Files Review: ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమాగా ప్రచారం చేయబడిన ‘రాజ‌ధాని ఫైల్స్‌’ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉందంటే...

Rajadhani Files: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్జీవీ కంపెనీలో రూపొందిన 'వ్యూహం', 'శపథం' వంటి మరో రెండు పొలిటికల్ చిత్రాలు మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్నాయి. వాటికంటే ముందే ఇప్పుడు 'రాజధాని ఫైల్స్' అనే ఓ పొలిటికల్ డ్రామా థియేటర్లలోకి వచ్చేసింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా తీసిన సినిమాగా ప్రచారం జరగడంతో, జనాల్లో ఆసక్తి నెలకొంది. అయితే శుక్రవారం రిలీజైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది.

వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, అఖిలన్, వీణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. భాను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కంఠమనేని రవిశంకర్ నిర్మించారు. ఓ రాష్ట్ర రాజధాని, దానికి భూములిచ్చిన రైతుల పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. అరుణప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఐరావతి కోసం అక్కడి రైతుల నుంచి భూ సేకరణ చేస్తారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, అధికార వికేంద్రీక‌ర‌ణ పేరుతో నాలుగు రాజ‌ధానులను ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకుంటారు. దీంతో రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళ‌న బాట ప‌డతారు. అధికార పార్టీ ఈ ఆందోళ‌న‌ల‌పై ఉక్కుపాదం మోపడంతో ఆ ప్రాంతంలోని రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఉద్యమాన్ని ఎలా నడిపించారు? రైతుల‌కు ప్ర‌తినిధులుగా ఉన్న హీరో కుటుంబం ఎలాంటి పాత్ర పోషించింది? చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమా మిగతా కథ.

Also Read: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్న బుచ్చిబాబు, RC16 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

'రాజధాని ఫైల్స్' అనేది ఫిక్షనల్ సినిమా అని చెప్పినప్పటికీ, కొన్ని నిజ జీవిత సంఘటనల ప్రేరణగా కల్పిత సన్నివేశాలను జోడించి తెరకెక్కించారనే విషయం అందరికీ అర్థమవుతుంది. స్టోరీ లైన్ గా చెప్పుకోడానికి బాగానే ఉన్నా, సినిమాగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆడియెన్స్ కి నచ్చే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, సినిమా చాలా బోరింగ్‌గా సాగదీతగా ఉండటం, కాన్ ఫ్లిక్ట్ పాయింట్ కన్విన్సింగ్ గా చెప్పకపోవడం, అసలు ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వకపోవడం ప్రధాన లోపాలుగా చెబుతున్నారు. కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి కానీ, ఎమోషన్స్ మిస్ అవ్వడంతో ఒక సినిమాగా ఏమాత్రం మెప్పించదని రివ్యూలు తేల్చేశాయి. 

'రాజధాని ఫైల్స్'లో ప్రధాన నటీనటుల నటన ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. సీనియర్ యాక్టర్స్ వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనతో ఆకట్టుకున్నారు. హీరోగా నటించిన పుష్పరాజ్ అఖిలన్ పర్వాలేదనిపించాడు.. కొన్ని సన్నివేశాల్లో మెప్పించాడు. మిగతా పాత్రల్లో పెద్దగా పేరు లేని నటీనటులే కనిపించారు. ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ, మణిశర్మ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. 2 గంటల 40 నిమిషాలు ఉన్న సినిమాని ఇంకాస్త బెటర్ గా ఎడిటింగ్ చేయాల్సింది. ఓవరాల్ గా ప్రధాన తారాగణం నటన మెప్పించినా, ఎమోషన్ మిస్ అవ్వడంతో ఈ సినిమా మెజారిటీ ఆడియన్స్ ను నిరాశ పరిచిందని చెప్పాలి.

Also Read: ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న మమ్ముటి 'భ్రమయుగం' - ఆ సీన్స్ చాలా టెర్రిఫిక్!

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget