అన్వేషించండి

Raj Tarun: అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు - 11 రోజులు ఫుట్‌పాత్‌పై పడుకున్న, రాజ్‌ తరుణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Raj Tarun about Struggles: ఈ మధ్య రాజ్‌ తరణ్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మరాడు. ఇటీవల భలే ఉన్నాడే మూవీతో వచ్చిన తరుణ్‌ తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. 

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. తనని మోసం చేశాడంటూ ప్రియురాలు లావణ్య పెట్టిన కేసుతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. వరుస ప్లాప్స్‌ వచ్చినా కూడా రాజ్‌ తరుణ్‌ ప్రెస్‌ మీట్‌ అనగానే అంతా ఆసక్తి చూపుతున్నారు. దీంతో అతడికి సంబంధించిన ఎలాంటి వార్తయిన చర్చనీయాంశం అవుతుంది. అయితే ఒకప్పుడు రాజ్‌ తరుణ్‌ వరుస హిట్స్‌ ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఉయ్యాల జంపాల, కుమార్‌ 21ఎఫ్‌ చిత్రాల హిట్‌తో యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

కానీ, ఆ తర్వాత వరుస ప్లాప్స్‌తో ఢీలా పడ్డాడు. చాలా గ్యాప్‌ తర్వాత 'నా సామిరంగ'తో ఒక హిట్‌ అందుకున్నాడు. కానీ, అది కింగ్‌ నాగార్జున అకౌంట్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత  పురుషోత్తముడు, తిరగబడరా సామీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అవి కూడా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. కానీ, వరసగా సినిమాలు రిలీజ్‌ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా భలే ఉన్నాడే సినిమా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కెరీర్‌ ప్రారంభంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. 

రూ. 3వేలకు అసిస్టెంట్  డైరెక్టర్ గా 

హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌ నిజానికి డైరెక్టర్‌ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడట. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "బిటెక్‌ చదువుతుండగానే షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. దాదాపు 52 షార్ట్‌ ఫిలింస్‌ చేశాను.  అప్పుడే నన్ను ఎవరైనా ఇండస్ట్రీవాళ్లు గుర్తించి ఆఫర్‌ ఇస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నా. అదే టైంలో డైరెక్టర్‌ రామ్మోహన్‌ పిలిచి యాక్టింగ్‌ చేస్తావా? డైరెక్షన్‌ చేస్తావా? అన్నారు. నేను డైరెక్షనే చేస్తానని చెప్పాను. అలా ఆయన దగ్గర రూ. 3వేలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను" అని చెప్పుకొచ్చాడు.  అనంతరం మాట్లాడుతూ... ఆయనతో నేను తరచూ సీన్స్‌ చర్చించేవాడిని. ఒక్క సీన్‌ని ఉదయం నుంచి రాత్రి వరకు చర్చించేవాళ్లం. అప్పుడు నేను పర్వాలేదు.. కానీ, ఇంకాస్త బాగుండాల్సింది అని తరచూ విసుక్కునేవారు.

అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేవు

అలా ఆయన నెల రోజులు ఓపిక పట్టారు. ఆ తర్వాత కోపం వచ్చి నువ్వుంటే స్క్రిప్ట్‌ ముందుకు సాగదు వెళ్లిపో అన్నారు. దాంతో ఏం చేయాలో తోచలేదు. బిటెక్‌ మధ్యలో వదిలేసి వచ్చాను. ఇక్కడ ఆఫర్స్‌ లేవు. దీంతో ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టమైంది. డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఏం చేయాలో తోచలేదె. ఫుట్‌పాత్‌పైనే 11 రోజులు పడుకున్నా. నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడిని. అప్పుడు నాకు 20 ఏళ్లు. ఆ వయసులో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది. అందుకే ఏదోకటి సాధించాక ఇంటికి తిరిగి వెళ్లాలి అనుకున్నాను. మొండిగా ఫుట్‌పాత్‌పై ఉన్నాను. అప్పుడే రామ్మోహన్‌ గారే మళ్లీ నన్ను పిలిచారు. ఈసారి ఆయన రైటర్‌గా నాకు ప్రమోషన్‌ ఇచ్చారు. అప్పుడే కుమారి 21ఎఫ్‌ సినిమాతో హీరోను అయ్యాను" అంటూ చెప్పుకొచ్చాడు.  

Also Read: సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీం ముచ్చట్లు - జాన్వీపై కొరటాల ఆసక్తికర కామెంట్స్‌! అదిరిపోయిన ప్రొమో

టాప్ హెడ్ లైన్స్

Aasmaan First Look : శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
శ్రీహరి కొడుకు హీరోగా ఆస్మాన్ - ఫస్ట్ లుక్... యాక్షన్ వేరే లెవల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget