అన్వేషించండి

నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు, బదులుగా వారికి సహాయం చేయండి: రాఘవా లారెన్స్

ప్రముఖ నటుడు కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ సొంతంగా ఓ ట్రస్ట్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపించకండి అంటూ లారెన్స్ తాజాగా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంతంగా ఓ ట్రస్ట్ ను కూడా రన్ చేస్తున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా రాఘవ లారెన్స్ 'తన ట్రస్ట్ కు ఎవరూ డబ్బులు పంపించకండి' అంటూ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియోని పంచుకున్నారు రాఘవ లారెన్స్.

ఈ వీడియోలో లారెన్స్ మాట్లాడుతూ.. "కొద్ది రోజులకు ముందు నేను ఒక ట్వీట్ చేశాను. అదేంటంటే నా ట్రస్ట్ కి ఎవరు డబ్బులు పంపించకండి అని, నా పిల్లల్ని నేనే చూసుకుంటాను అని. దానికి కారణం ఏంటంటే, నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ మొదలు పెట్టాను. ఓ 60 మంది పిల్లల్ని ఇంట్లో ఉంచి పెంచడం, అలాగే వికలాంగులందరికీ డాన్స్ నేర్పించడం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడం.. ఇవన్నీ నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడే చేశాను. అయితే అప్పుడు ఒక్కన్నే ఇవన్నీ చేయలేకపోయేవాడిని. అందుకే నేను మిగతా వాళ్ళ సహాయం కోరుకున్నాను"అని అన్నారు.

"కానీ ఇప్పుడేమో నేను హీరో అయిపోయాను. హీరో అయ్యాక రెండేళ్లకొక సినిమా చేసే వాడిని. కానీ ఇప్పుడేమో సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగా డబ్బులు వస్తున్నాయి. నీకు బాగానే డబ్బులు వస్తున్నాయి కదా. ఎందుకు మిగతా వాళ్ళని అడిగి చేయాలి, నువ్వే చేయొచ్చు కదా అని నాలో నాకే అనిపిస్తోంది. సో నేను ఏదో పొగరుగా డబ్బులు వద్దు అని చెప్పడం లేదు. నాకు ఇచ్చే డబ్బుల్ని మీ ఇంటి పక్కన కష్టపడే ట్రస్టులు చాలా ఉన్నాయి. నేను చూశాను. వాళ్లకు సహాయం చేయండి. వాళ్లకి మీ సహాయం ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలామంది సహాయం చేయరు. నేను ఎంత చెప్పినా సరే 'లేదు మేము మీతో కలిసి సాయం చేస్తామని' ఎంతోమంది చెబుతున్నారు. దానికి చాలా సంతోషం. కష్టపడే వాళ్ళు ఎవరో నేనే చెప్తాను. మీరే వెళ్లి వాళ్లకి మీ చేతితో సాయం చేయండి. అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్" అంటూ తాజా వీడియోలో పేర్కొన్నారు.

దీంతో రాఘవ లారెన్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాఘవ లారెన్స్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన హీరోగా 'చంద్రముఖి 2' అనే సినిమా తెరకెక్కుతోంది. పి. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారెన్స్ సరసన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్ 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.

Also Read : థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న 'మా ఊరి పొలిమేర 2' - ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget