అన్వేషించండి

Pushpa 2 Ticket Price : మూవీ లవర్స్​కు గుడ్ న్యూస్... తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన "పుష్ప 2" టికెట్ రేట్లు

Pushpa 2 : భారీ అంచనాలతో డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన మూవీ ' పుష్ప 2'. తాజాగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ ధరలు తగ్గినట్టుగా తెలుస్తోంది.

Pushpa 2 Ticket Prices in AP and TS : నాలుగు రోజుల నుంచి 'పుష్ప 2 : ది రూల్' బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతోంది. డిసెంబర్ 5న మొదలైన 'పుష్ప 2' ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఈ సినిమా దాదాపు 800 కోట్లు కొల్లగొట్టి, రికార్డులను గల్లంతు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'పుష్ప 2' సినిమాను చూడాలనుకునే తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' మూవీ కలెక్షన్లపరంగా రఫ్పాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ చిత్రంగా చరిత్రను క్రియేట్ చేసింది. ఓవైపు సినిమా అంచనాలను అందుకుని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంటే, మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగా పెరిగిన టికెట్ ధరలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బెనిఫిట్ షో టికెట్లు ధరలు ఏకంగా రూ. 800 నుంచి రూ. 1000 రూపాయలు ఉండడం గమనార్హం. ఆ తర్వాత కూడా టికెట్ ధరలు భారీగా ఉండడంతో ప్రేక్షకులపై భారం పడింది.

చాలావరకు సింగిల్ స్క్రీన్ లలో 'పుష్ప 2' టికెట్ ధరలు రూ. 300 ఉండడం సాధారణ ప్రేక్షకుడిని థియేటర్లకు రాకుండా ఆపింది అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సామాన్య ప్రేక్షకుడికి సినిమాను చూడాలని ఉన్నప్పటికీ, ఫ్యామిలీతో కలిసి ఈ టికెట్ ధరలతో సినిమాను చూడడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యింది. దీంతో ఇప్పటిదాకా ఎక్కువగా అభిమానులే ఈ సినిమాను వీక్షించారు. కానీ ఇప్పుడు వీకెండ్ పూర్తయ్యింది. ఇకపై కూడా అభిమానులే సినిమా లాంగ్ రన్ భారాన్ని మోయలేరు. ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించాలంటే పెరిగిన టికెట్ రేట్లను తగ్గించక తప్పదు. అందుకే టికెట్ల రేటుపై చిత్ర బృందం పునరాలోచించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల టికెట్ ధరలు తగ్గించినట్టు సమాచారం. దీంతో ప్రేక్షకులకు ఉపశమనం కలిగినట్టుగా అయ్యింది. 

ఇప్పుడు టికెట్ ధర రెండు రాష్ట్రాల్లోనూ రూ. 200 ఉండగా, మల్టీప్లెక్స్ లో మాత్రం రూ. 395 ఉంది. అయితే ఈ టికెట్ ధరలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో థియేటర్ చైన్లను బట్టి కాస్త తేడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి టికెట్ ధరల తగ్గింపు వల్ల చాలామంది ప్రేక్షకులు మరోసారి సినిమాలు చూడడానికి ఆసక్తిని కనబరిచే ఛాన్స్ ఉంది. ఇంకేముంది ఫలితంగా టికెట్ ధరల రేట్లు తగ్గడంతో ఫుట్ ఫాల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కలెక్షన్లు మరింతగా పెరిగే ఛాన్స్ లేకపోలేదు. మరి టికెట్ రేట్లు తగ్గుముఖం పట్టిన తర్వాత 'పుష్ప 2'కు కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి పుష్ప రాజ్ మ్యాజిక్ ఇలాగే కొనసాగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హడావిడి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చూడాల్సిందే.

Also Readబూత్ బంగ్లాలో RC 16... అమెరికాలో Game Changer... ఇదీ డిసెంబర్‌లో రామ్ చరణ్ షెడ్యూల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Embed widget