అన్వేషించండి

Pushpa 2: ‘పుష్ప 2’ నుంచి అదిరిపోయే అప్ డేట్ - బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

‘పుష్ప 2’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. మరో 100 రోజుల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Pushpa 2 100 Days Countdown Poster: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర  'పుష్ప' ఓ రేంజిలో సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా విడుదలైన ప్రతి చోటా అద్భుత విజయాన్ని అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. పాటలు, ఫైట్స్, కథ సహా అన్ని అంశాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

మరో 100 రోజుల్లో థియేటర్లలో ‘పుష్ప 2’ సందడి

‘పుష్ప 2’ మూవీకి మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ వెల్లడించారు. ఐకానిక్ బాక్సాఫీస్ ఎక్స్ పీరియెన్స్ కోసం రెడీ ఉండాలన్నారు. డిసెంబర్ 6న థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ ఎడమ చేతిని పైకెత్తి అభివాదం చేస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా

‘పుష్ప 2’ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిన ఉన్నా, షూటింగ్ ఆలస్యం కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ‘పుష్’ సినిమాకు వచ్చిన భారీ క్రేజ్ నేపథ్యంలో సీక్వెల్ ను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అందుకే షూటింగ్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. తొలుత ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ, వాయిదా వేశారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. గత కొద్ది రోజులుగా సుకుమార్ మూడు యూనిట్లుగా సినిమా షూట్ చేస్తున్నారు. రెండు యూనిట్లు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా, మరో యూనిట్ మారేడుమిల్లిలో చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  

ఓ వైపు షూటింగ్, మరోవైపు ఎడిటింగ్  

ఓవైపు సినిమా షూటింగ్ కొనసాగిస్తూనే మరోవైపు ఎడిటింగ్ పనులు కొనసాగిస్తున్నారట. ఈసారి అనుకున్న సమయానికి తప్పకుండా సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే, షూటింగ్ తో పాటు ఎడిటింగ్ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారట. దాదాపు షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.  

Also Read: లావణ్య వ్యవహారంపై రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, అలా అనేశాడేంటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics : ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Sitaram Yechury : నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు
నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు
WhatsApp Features: ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​
ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics : ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Sitaram Yechury : నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు
నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు
WhatsApp Features: ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​
ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​
Bigg Boss 8 Telugu Day 12 Review: ఏడుపుగొట్టు ఎపిసోడ్ - క్రింజ్ టాస్కులు విరక్తి పుట్టించిన కంటెస్టెంట్లు
Bigg Boss 8 Telugu Day 12 Review: ఏడుపుగొట్టు ఎపిసోడ్ - క్రింజ్ టాస్కులు విరక్తి పుట్టించిన కంటెస్టెంట్లు
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YS Sharmila: ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే - వైఎస్ షర్మిల డిమాండ్
ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే - వైఎస్ షర్మిల డిమాండ్
Embed widget