News
News
X

Project K Music Director Update : ప్రభాస్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ - తమిళ్‌కు వెళ్ళిన నాగ్ అశ్విన్

Prabhas Deepika Padukone Movie Update : ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. సంగీత దర్శకుడిని మార్చినట్టు తెలిసింది. 

FOLLOW US: 
Share:

దర్శకుడు నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ (Mickey J Meyer) లది హిట్ కాంబినేషన్. 'మహానటి'కి వీళ్ళిద్దరూ వర్క్ చేశారు. ఆ సినిమాకు మిక్కీ మంచి పాటలు, నేపథ్య సంగీతం అందించారు. 'పిట్ట కథలు'లో ఓ కథకు కూడా సంగీతం అందించారు. ఆ అభిమానమో? లేదంటే మరొకటో? ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమాకు కూడా అతడిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు నాగ్ అశ్విన్. అయితే, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

మిక్కీ బదులు సంతోష్ నారాయణన్ 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. తొలుత ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయన సినిమాకు వర్క్ చేయడం లేదని చిత్ర నిర్మాత సి. అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

'ప్రాజెక్ట్ కె'కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా', 'కబాలి', ధనుష్ 'కర్ణన్', 'వడా చెన్నై', విక్రమ్ 'మహాన్' తదితర సినిమాలకు సంతోష్ నారాయణన్ పని చేశారు. నేచురల్ స్టార్ నాని 'దసరా'కు సైతం ఆయనే సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఆ సినిమా పాటలు వైరల్ అయ్యాయి.

Project K Release On Sankranti 2024: జనవరి 12, 2024లో 'ప్రాజెక్ట్ కె'ను విడుదల చేయనున్నట్లు మహాశివరాత్రి సందర్భంగా అనౌన్స్ చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. 

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'సీతా రామం' సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత అశ్వినీదత్... 'ప్రాజెక్ట్ కె' విడుదల తేదీ గురించి హింట్ ఇచ్చారు. 

Also Read అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్! 

అక్టోబర్ 18, 2023న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 'సీతా రామం' విడుదల సమయంలో అశ్వినీదత్ చెప్పారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్.

Also Read వచ్చే వారమే మంచు మనోజ్ రెండో పెళ్ళి - ఏడడుగులు వేసేది ఎప్పుడంటే? 

Published at : 25 Feb 2023 04:55 PM (IST) Tags: deepika padukone Prabhas Mickey J Meyer Project K Updates Santhosh Narayanan

సంబంధిత కథనాలు

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా