By: ABP Desam | Updated at : 25 Feb 2023 12:09 PM (IST)
'సెల్ఫీ' సినిమాలో ఓ స్టిల్ (Image Courtesy : Akshay Kumar Instagram)
ప్రతి కథానాయకుడి ప్రయాణంలో పరాజయాలు ఉంటాయ్! అది సహజం కూడా! అయితే, 'సెల్ఫీ' (Selfiee) లాంటి దారుణమైన పరాభవం అగ్ర కథానాయకులలో ఎవరికీ ఉండదేమో!? హిందీ సినిమా ఇండస్ట్రీలో పట్టుమని పదేళ్ళు నిండని హీరో సినిమాకు వచ్చిన ఓపెనింగ్ కూడా అక్షయ్ కుమార్ (Akshay Kumar) కు రాకపోతే ఏమనాలి? బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో 'సెల్ఫీ' కలెక్షన్స్ ఇప్పుడు హాట్ హాట్ టాపిక్.
మరీ మూడు కోట్లు ఏంటి?
Selfiee Movie Collection Day 1 : మలయాళ సూపర్ హిట్ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్'ను హిందీలో 'సెల్ఫీ' పేరుతో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రీమేక్ చేశారు. అందులో ఇమ్రాన్ హష్మీ మరో హీరో. ఈ సినిమాకు ఫస్ట్ వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా? జస్ట్ మూడు కోట్లు మాత్రమే. ఇంకా లెక్కలు తీస్తే అంత కంటే తక్కువ ఉండొచ్చట. అక్షయ్ లాంటి స్టార్ నటించిన సినిమాకు మరీ మూడు కోట్లు ఏంటి? హిందీ ట్రేడ్ వర్గాలు నివ్వెరపోతున్నాయి.
కార్తీక్ ఆర్యన్ 'షెహజాదా'కే ఎక్కువ!
'సెల్ఫీ' కంటే ముందు వారం 'షెహజాదా' విడుదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాకు అది రీమేక్. ఆ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 6 కోట్లు. అక్షయ్ సినిమాకు అందులో సగం వచ్చాయి.
మల్టీప్లెక్స్ స్క్రీన్స్ వరకు చూసుకున్నా అక్షయ్ కుమార్ సెల్ఫీ వెనుకబడింది. షారుఖ్ 'పఠాన్' మల్టీప్లెక్స్‌లలో ఫస్ట్ డే రూ. 27.08 కోట్లు కలెక్ట్ చేస్తే... 'షెహజాదా' రూ. 2.29 కోట్లు కలెక్ట్ చేసింది. మరి, అక్షయ్ 'సెల్ఫీ' మల్టీప్లెక్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? జస్ట్ రూ. 1.30 కోట్లు
పదేళ్ళలో అక్షయ్ వరస్ట్ ఓపెనింగ్ ఇది! అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డ్ చొస్తే... గత పదేళ్ళలో ఎప్పుడూ ఇంత వరస్ట్ ఓపెనింగ్ / ఫస్ట్ డే కలెక్షన్స్ లేవు. మినిమమ్ ఐదు కోట్లు అయినా వచ్చేవి. అక్షయ్ కుమార్ లాస్ట్ సినిమా 'రామ్ సేతు' ఫస్ట్ డే 15.25 కోట్లు కలెక్ట్ చేసింది. 'రక్షా బంధన్' కూడా రూ. 8.20 కోట్లు కలెక్ట్ చేసింది.
Also Read : వచ్చే వారమే మంచు మనోజ్, మౌనిక పెళ్ళి - ఏడడుగులు వేసేది ఎప్పుడంటే?
#Selfiee at national chains… *Day 1* biz…#PVR: 64 lacs#INOX: 43 lacs#Cinepolis: 23 lacs
— taran adarsh (@taran_adarsh) February 25, 2023
⭐️ Total: ₹ 1.30 cr
Nett BOC.
SHOCKINGLY LOW NUMBERS
2023 releases… national chains only - *Day 1* biz…
⭐️ #Pathaan: ₹ 27.08 cr
⭐️ #Shehzada: ₹ 2.92 cr
Nett BOC. pic.twitter.com/Gi9W9gaqep
ఫస్ట్ డే పది కోట్ల కంటే తక్కువ కలెక్షన్స్ సాధించిన అక్షయ్ కుమార్ సినిమాలు చూస్తే... 'బెల్ బాటమ్' ముందు ఉంటుంది. ఆ సినిమా ఓపెనింగ్స్ 2.75 కోట్లు మాత్రమే. అప్పట్లో కరోనా ఉందని దాన్ని లెక్కల లోంచి తీసేస్తే... అక్షయ్ అతిథి పాత్రలో కనిపించిన తాప్సీ 'నామ్ షబానా' (రూ. 5.12 కోట్లు), 2015లో వచ్చిన బేబీ (రూ. 09.30 కోట్లు), అక్షయ్ స్పెషల్ రోల్ చేసిన 'ది షౌకీన్స్' (రూ. 5.12 కోట్లు), 2013లో వచ్చిన 'స్పెషల్ 26' (రూ. 7 కోట్లు) సినిమాలు ఉన్నాయి.
పదేళ్ళలో అక్షయ్ కుమార్ ఫస్ట్ డే కలెక్షన్లలో మరీ తక్కువ, ఐదు కోట్ల లోపు ఉన్న సినిమాలు 2012లో 'ఓ మై గాడ్', 'జోకర్'. అందులో 'ఓ మై గాడ్' సినిమాలో ఆయన హీరో కాదు. స్పెషల్ రోల్ చేశారు. ఆ సినిమాకు ఫస్ట్ డే రూ. 4.25 కోట్లు కలెక్ట్ చేసింది. దాని కంటే ముందు వచ్చిన 'జోకర్' ఐదు కోట్లతో సరిపెట్టుకుంది. 'సెల్ఫీ' వసూళ్ళు ప్రేక్షకులలో అక్షయ్ కుమార్ క్రేజ్, స్టార్‌డమ్‌కు సవాళ్లు విసురుతున్నాయి.
Also Read : 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'టాప్ గన్'ను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్'కు అవార్డు
‘దసరా’కు ‘రావణాసుర’ సాయం - రవితేజను కలిసిన నాని, పెద్ద ప్లానే వేసినట్లున్నారుగా!
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?
Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు
AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !