అన్వేషించండి

Kalki 2: 'కల్కి 2'పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత - షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడేనట!

Kalki 2 Shooting: కల్కి 2 షూటింగ్‌పై నిర్మాతలు స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల రష్యాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారు కల్కి 2 షూటింగ్‌ ఎప్పుడో చెప్పేశారు.

Kalki 2 Shooting Update: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బాక్సాఫీసు రారాజు అని మరోసారి చూపించిన సినిమా 'కల్కి 2898 ఏడీ'. జూన్‌ 27న థియేటర్లోకి వచ్చిన బాక్సాఫీసు కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కల్కి 2898 ఏడీ వరల్డ్‌ వైడ్‌గా రూ. 1200 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌, భారీ తారాగణతో రూపొందిన ఈ సినిమాకు ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. ఇక ఇండస్ట్రీలో ప్రముఖులంతా సినిమా ప్రశంసలు కురిపించారు.

కల్కి 2898 ఏడీతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాడని, వెండితెరపై విజువల్‌ వండర్‌ చూపించాడంటూ ఆయన పనితీరును కొనియాడారు. ముఖ్యంగా చివరి ఫైట్‌ సీన్‌ అదుర్స్‌ అని, ఫైనల్లో ప్రభాస్‌ను కర్ణుడిగా రివీల్‌ చేసిన తీరు గూస్‌బంప్స్‌ తెప్పించాయన్నారు. అంతగా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ సినిమా సీక్వెల్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కల్కి 2898 ఏడీ పార్ట్‌ 2కి సంబంధించిన షూటింగ్‌ కూడా జరిగిందని నిర్మాత అశ్వినీ దత్‌ ఓ ఇంటర్య్వూలో తెలిపాడు. మూవీ విడుదలై రెండు నెలల దాటింది. ఇప్పుడు కల్కి 2 అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అతి త్వరలోనే కల్కి 2 షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు నాగ్‌ అశ్విన్‌ సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా దీనిపై స్వయంగా నిర్మాతలే అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిలిం వీక్‌లో నాగ్‌ అశ్విన్‌ భార్య, నిర్బాత స్వప్నదత్‌ ఆమె సోదరి, నిర్మాత ప్రియాంక దత్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన వారు కల్కి పార్ట్‌ 2 షూటింగ్‌పై అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు కల్కి చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అలాగే పార్ట్‌ 2 షూటింగ్‌ ఎప్పుడో కూడా చెప్పారు.

వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి కల్కి 2 షూటింగ్‌ జరుగుతుందని ఆమె వారు చెప్పుకొచ్చారు. షూటింగ్‌ ప్రారంభం కాగానే పార్ట్‌ 2 సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తామని చెప్పారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఆ తర్వాత కల్కి మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌పై ప్రియాంక దత్‌ మాట్లాడారు. "మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ మేమింకా జరుపుకోలేదు. ప్రస్తుతానికి వాట్సప్‌లో మాత్రమే సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. కల్కి మూవీ రిలీజ్‌ తర్వాత ఎంతో మంది ప్రశంసిస్తూ మేసేజ్‌లు చేశారు. మొదటి వారం రోజులు ఎంతో మంది ప్రముఖులు మూవీపై ప్రశంసలు కురిపించారు.

ప్రపంచ నలుమూలల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. ఎంతో మంది మా సినిమాకు మద్దతు ఇస్తు మా సినిమా స్వచ్చందంగా ప్రచారం చేశారు" అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ రాజా సాబ్‌, హను రాఘవపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల హను రాఘవపూడి సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమం జరిగింది. మరోవైపు రాజా సాబ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అలాగే సలార్‌ 2 షూటింగ్‌ కూడా జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇక త్వరలోనే రాజా సాబ్‌ షూటింగ్‌ పూర్తవుతుందని, ఆ తర్వాత ప్రభాస్‌తో కల్కి 2 షూటింగ్‌ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.  

Also Read: సరిపోదా శనివారం బాక్సాఫీస్ రిపోర్ట్ - నాని సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు
Embed widget