Samantha: సమంత సినిమాలో అనుష్క ఉందా?
సమంత సినిమాలో అనుష్క ఉన్నారా? ఆమె అతిథి పాత్ర చేశారా? ఈ ప్రశ్నలకు నిర్మాత నీలిమా గుణ క్లారిటీ ఇచ్చారు.
అనుష్క (Anushka Shetty), సమంత (Samantha Ruth Prabhu)... తెలుగు, తమిళ భాషల్లో ఇద్దరూ స్టార్ హీరోయిన్లే! అయితే, సమంత కంటే అనుష్క సీనియర్. కాస్త ముందు వచ్చారు. ఇప్పటివరకూ వీళ్ళిద్దరూ సినిమా చేయలేదు. స్క్రీన్ మీద కలిసి కనిపించలేదు. 'శాకుంతలం' (Shaakuntalam Movie)లో కనిపించే ఛాన్స్ ఉందని ఓ నెటిజన్ డౌట్. సమంత టైటిల్ పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అనుష్క అతిథి పాత్రలో చేశారని! దీనిపై చిత్ర నిర్మాత, గుణశేఖర్ కుమార్తె నీలిమా గుణ క్లారిటీ ఇచ్చారు.
''స్వీటీ (అనుష్క) గారు మాపై చూపిస్తున్న ప్రేమకు, మాకు ఇస్తున్న మద్దతుకు మేము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. 'శాకుంతలం'లో ఆమె లేరు. అటువంటి అతిథి పాత్ర ఏదీ లేదు'' అని నీలిమా గుణ తెలిపారు.
Producer Neelima Guna About Shaakuntalam Movie Release: 'శాకుంతలం' ఈ ఏడాది విడుదల అవుతుందని నీలిమా గుణ తెలిపారు. త్వరలో టీజర్, ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. సినిమాలో సమంత యువరాణిగా కనిపిస్తారా? అనే ప్రశ్నకు మాత్రం నీలిమా గుణ సమాధానం దాటవేశారు. 'శాకుంతలం'లో సమంత రాణిగా కనిపించనున్నట్టు ఎమోజీల ద్వారా చెప్పారు.
Also Read : రామ్ (Ram) తో కచ్చితంగా సినిమా ఉంటుంది - హరీష్ శంకర్
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. అనన్యా నాగళ్ళ ఓ పాత్ర చేశారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఓ పాత్రలో నటించారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాది సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : వివాదంలో చిక్కుకున్న RRR రైటర్! రాజమౌళి తండ్రి వీడియో వైరల్, ఆయన మాటల్లో నిజమెంత?
View this post on Instagram