అన్వేషించండి

Simbu: శింబుపై నిర్మాత కేసు - ఆ సినిమాలో నటించొద్దంటూ ఫిర్యాదు

Simbu: గత కొన్నేళ్లలో కోలీవుడ్ యంగ్ హీరో శింబు సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించాడు. ఇప్పటికే ఈ హీరో చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు ఉండగా తాజాగా ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో తనపై మరో ఫిర్యాదు నమోదయ్యింది.

Producer Filed Case On Simbu: కోలీవుడ్ యాక్టర్ శింబు చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ తిరుగుతూనే ఉంటుంది. దాదాపుగా తన ప్రతీ సినిమాకు సంబంధించిన ఏదో ఒక హాట్ టాపిక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం మునుపటిలాగా శింబు.. సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. ఏడాదికి కేవలం ఒకటే సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక త్వరలోనే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’లో శింబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ‘థగ్ లైఫ్’లో శింబు క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ స్పెషల్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఇదే సినిమా తనను చిక్కుల్లో పడేసింది.

హ్యాండ్ ఇచ్చాడు..

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’లో శింబు నటించకూడదు అని నిర్మాత ఇషారీ గణేష్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో శింబుపై కేసు ఫైల్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఇషారీ గణేషే.. ఈ హీరోపై పలు ఫిర్యాదులు చేశాడు. శింబు, ఇషారీ గణేష్ కాంబినేషన్‌లో ‘కరోనా కుమార్’ అనే మూవీ తెరకెక్కాల్సింది. శింబు హీరోగా నటించడానికి అగ్రిమెంట్ కూడా సైన్ చేసిన తర్వాత మూవీ చేయను అని చెప్పాడని ఈ నిర్మాత.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించాడు. ఇషారీ గణేష్ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషన్ బ్యానర్‌పై ఇప్పటకే ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు ఈ నిర్మాత.

అప్పటివరకు నటించకూడదు..

తరచుగా వస్తున్న ఫిర్యాదుల కారణంగా ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. శింబుకు రెడ్ కార్డ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అదే రెడ్ కార్డ్ కారణంగా తను ‘థగ్ లైఫ్’లో నటించకూడదని ఇషారీ గణేష్ ఫిర్యాదు చేశారు. ముందుగా ‘కరోనా కుమార్’లో నటించడానికి అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టడానికి వివరణ ఇవ్వమని కోరాడు. దీంతో కమల్ హాసన్ సినిమా చిక్కుల్లో పడుతుందని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఇప్పటికే శింబును ఆ పాత్ర కోసం తీసుకొని ప్రోమో కూడా షూట్ చేశారు మేకర్స్. ఒకవేళ శింబు ఈ మూవీలో నటించకపోతే మరో యంగ్ హీరో కోసం మూవీ టీమ్ సెర్చింగ్ మొదలుపెట్టాలి.

36 ఏళ్ల తర్వాత..

మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 1987లో ‘నాయకన్’ అనే మూవీ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. అప్పటినుండి వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి అవకాశం రాలేదు. దాదాపు 36 ఏళ్ల తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ వర్కవుట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. కానీ శింబు వల్ల మూవీ షూటింగ్‌లో ఆలస్యం అవుతుందేమోనని వారిలో సందేహం మొదలయ్యింది. శింబు కాకపోతే ఆ పాత్రలో నటించడానికి ఇంకా ఏ యంగ్ హీరో సెట్ అవుతాడని అంచనాలు వేసుకుంటున్నారు.

Also Read: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget