Harihara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ కాంట్రవర్శీ - ప్రొడ్యూసర్ బన్నీ వాస్ రియాక్షన్
Bunny Vas: పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ టైంలోనే థియేటర్స్ బంద్ వ్యవహారం, ఇండస్ట్రీపై పవన్ ఆగ్రహం వంటి అంశాలపై తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు.

Bunny Vas Reaction About HHVM Release Issue: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీల విధానం, థియేటర్స్ బంద్ వ్యవహారం.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ టైంలోనే ఇలా కావాలని చేశారంటూ జరిగిన ప్రచారం పెను దుమారం రేపింది. ఈ అంశంపై మూవీ ఇండస్ట్రీలో పెద్దలపై పవన్ సీరియస్ కావడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు.
అదే రీజన్!
పవన్ సినిమాను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ ఇష్యూను తెరపైకి తెచ్చారు? అంటూ సాగిన ప్రచారంపై ఎదురైన ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యోలో స్పందించారు బన్నీ వాస్. 'నాకు కూడా ఈ అంశంపై డీప్‌గా తెలియదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎగ్జిబిటర్స్ గ్రూప్స్ మధ్య కొన్ని డిస్కషన్స్ జరిగాయి. అది ఎక్కడ జరిగిందో తెలియదు. పవన్ కల్యాణ్ మూవీని ఆపితే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందనేలా చర్చలు జరిగాయట. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వాళ్లకు వెళ్లాయి. ఇండస్ట్రీ తరఫు నుంచే ఎవరో కలెక్ట్ చేసి పంపించారని తెలుస్తోంది.
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ వ్యవహారం ముగిసింది. ఆ వ్యవహారం అయిపోయిన తర్వాత కూడా మీటింగ్స్‌కు కాల్ చేశారు. ఈ స్క్రీన్ షాట్స్, ఇంటర్నల్ కాల్స్ వెళ్లడం, జూన్ 12న సినిమా రిలీజ్ అనుకోవడం.. అదే సమయంలో ఇలా జరగడంతో రియాక్షన్ కొంచెం గట్టిగానే వచ్చిందనుకుంటున్నా.' అని చెప్పారు.
Also Read: బన్నీతో కాదు ఎన్టీఆర్‌తో? - మైథలాజికల్ మూవీపై త్రివిక్రమ్ రూట్ మార్చేస్తున్నారా?
అసలేం జరిగిందంటే?
ఇటీవల ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజీల విధానంపై రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. పర్సంటేజీల విధానంలోనే తమకు కమీషన్ ఇవ్వాలంటూ జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్‌కు పిలుపునిచ్చారు ఎగ్జిబిటర్స్. అయితే, ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారి పవన్ 'హరిహర వీరమల్లు' మూవీపై పడింది. జూన్ 12న 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ టైంలో ఇలా థియేటర్స్ బంద్ అంటూ కావాలనే తెరపైకి తెచ్చారనే వాదన సాగింది.
ఇండస్ట్రీలో 'ఆ నలుగురు' పెద్ద నిర్మాతలు దీనికి కారణమంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ ప్రముఖ నిర్మాతలు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ ధరల పెంపు, షూటింగ్స్‌కు పర్మిషన్లు ఈజీగా ఇస్తున్నామని.. కనీసం ఇండస్ట్రీ నుంచి ఎవరూ సీఎం చంద్రబాబును కలవలేదని అన్నారు. ఈ వ్యవహారం ముదురుతుండగా నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇచ్చారు. పవన్ ఇండస్ట్రీకి పెద్దన్న లాంటి వారని.. ఆయన ఓ మాట అన్నా పడతామని చెప్పారు. థియేటర్స్ బంద్ వెనుక రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారంటూ చెప్పగా.. జనసేన పార్టీకి చెందిన ఆ నేతను సస్పెండ్ చేశారు.
ఇక 'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నమ్మొద్దంటూ మూవీ టీం ఇటీవలే క్లారిటీ ఇచ్చింది.






















