అన్వేషించండి

Pawan Kalyan: ఉస్తాద్ ఆగయా... పవన్ - హరీష్ సినిమా షూటింగ్ షురూ

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. ఒక సినిమా తర్వాత మరొక సినిమా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ముస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్‌లో ఒక సినిమా తర్వాత మరొక సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. గత నెలలో హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ వెంటనే సుజిత్ దర్శకత్వంలో 'దే కాల్ హిమ్ ఓజీ'లో తన క్యారెక్టర్ షూటింగ్ ఫినిష్ చేశారు.‌ ఇప్పుడు ఆ సినిమా నాలుగైదు రోజులు ప్యాచ్ వర్క్ మినహా పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు మరొక సినిమా సెట్స్‌లో‌ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు.

ఉస్తాద్ ఆగయా... షెడ్యూల్ షురూ!
తెలుగు చిత్ర సీమలో పవన్ అభిమానులు ఉన్నారు. అలాగే ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పవన్ వీరాభిమానులలో హరీష్ శంకర్ ఒకరు. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన 'గబ్బర్ సింగ్' రికార్డులు తిరగ రాసింది. ఆ సినిమా వచ్చిన పుష్కర కాలం తర్వాత పవన్, హరీష్ శంకర్ కలయికలో మరో సినిమా మొదలైంది అదే 'ఉస్తాద్ భగత్ సింగ్'.

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు అయ్యింది. పవన్ కళ్యాణ్ పాల్గొనగా కీలక తారాగణం మీద దర్శకుడు సన్నివేశాలు తెరకెక్కించారు. సుమారు నెల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని, దీంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: వీరమల్లు వాయిదా: ఖాళీ అయిన జూన్ రెండో వారం.. డబ్బింగ్ సినిమాలకు కలిసొచ్చింది


పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయనంక బోస్, ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి, యాక్షన్ సీక్వెన్స్‌: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి, స్క్రీన్ ప్లే: కె. దశరథ్, అడిషినల్ రైటింగ్: సి చంద్ర మోహన్.

Also Readఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Embed widget