అన్వేషించండి

Priyanka Chopra Diamond Necklace : ప్రియాంక చోప్రా వేసుకున్న నెక్లెస్ అమ్మితే పాన్ ఇండియా సినిమా తీయొచ్చు!

Priyanka Chopra Met Gala : ప్రియాంకా చోప్రా మెట్ గాలా వేడుకకు వెళ్లారు. ఆమె డ్రస్ సహజంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె మెడలో వేసుకున్న నెక్లెస్ రేటు తెలిస్తే  షాక్ అవ్వడం గ్యారెంటీ!

అందంతో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఆకట్టుకుంటే... ఆమె ధరించిన ఆభరణం రేటు అందరి నోరెళ్లబెట్టేలా చేసింది. ఒక్క డైమండ్ రేటు అంతా? అని ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు వివరాల్లోకి వెళితే...

న్యూయార్క్ సిటీలో మెట్రోపాలిటిన్ మ్యూజియంలో మెట్ గాలా (Met Gala 2023) ఈవెంట్ జరుగుతోంది. ప్రతి ఏడాది ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అని మెట్ గాలాకు పేరుంది. ఇండియా నుంచి ఆలియా భట్ కూడా అందులో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా హాలీవుడ్ స్టార్ కదా! ఆమె కూడా వెళ్లారు. ఎప్పటిలా, సహజంగానే తన అందంతో ప్రియాంకా చోప్రా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ అండ్ వైట్ డ్రస్సులో సందడి చేశారు. 

ప్రియాంక డైమండ్ నెక్లెస్ ఉంది చూశారూ...
ప్రియాంకా చోప్రా ధరించిన డ్రస్ మాట పక్కన పెడితే... మెడలో వేసుకున్న డైమండ్ నెక్లెస్ రేటు అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. ప్రముఖ ఇటాలియన్ జ్యువలరీ బ్రాండ్ బుల్గేరికి ప్రియాంకా చోప్రా బ్రాండ్ అంబాసిడర్. ఆ కంపెనీ రూపొందించిన నెక్లెస్ ధరించారు. 

ఒక్కసారి నెక్లెస్ చూడండి... అందులో ఓ డైమండ్ ఉంది కదా! దాని రేటు ఎంతో తెలుసా? 25 మిలియన్ డాలర్స్ అంట! ఇండియన్ కరెన్సీలో సుమారు 204.5 కోట్ల రూపాయలు! అది అమ్మితే పాన్ ఇండియా సినిమా తీయొచ్చు కదూ!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ (Citadel Web Series) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇటీవల విడుదల అయ్యింది. అంటే రెండు ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి అనుకోండి. వారం వారం కొత్త ఎపిసోడ్స్ విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ఎపిసోడ్స్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది.

Also Read : ఎన్టీఆర్ స్టైల్ & యాక్షన్ అదుర్స్ - రత్నవేలు ఏం చెప్పారో చూశారా?

'సిటాడెల్' కథ ఏమిటంటే?
మేసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నాదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా) గ్లోబల్ స్పై ఏజెన్సీ సిటాడెల్‌కు చెందిన టాప్ ఏజెంట్లు. ఒక సీక్రెట్ మిషన్ మీద వెళ్తే అది తమ కోసం వేసిన ట్రాప్ అని తెలుస్తుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో మేసన్ తన గతాన్ని మర్చిపోతాడు. ఆ సమయంలోనే సిటాడెల్ కూడా అంతం అయిపోతుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత సిటాడెల్ ఏజెంట్ల వివరాలు, న్యూక్లియర్ కోడ్స్ ఉన్న ఒక బ్లాక్ బాక్స్ సీఐఏకి దొరికిందని ‘మాంటికోర్’ అనే టెర్రరిస్ట్ సంస్థకు తెలుస్తుంది. వారు కూడా ఆ బాక్స్ కోసం ఎప్పటినుంచో వెతుకుతూ ఉంటారు. అనుకోకుండా ఈ గేమ్‌లోకి మేసన్ కేన్ తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నాదియా ఏం అయింది? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్

ఇండియన్ 'సిటాడెల్'లో సమంత!
'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ కూడా రూపొందుతోంది. అందులో సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ హీరో. ప్రస్తుతం లండన్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ చేస్తున్నారు. హిందీ సహా ఇతర భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
AR Rahman - Subhash Ghai: నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
Embed widget