Priyanka Chopra: న్యూయార్క్‌లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్ - అసలు ఏమైంది? ఎందుకు మూసేశారు?
Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న వ్యాపారాల్లో సోనా అనే రెస్టారెంట్ కూడా ఒకటి. తను ఈ రెస్టారెంట్ పార్ట్‌నర్‌షిప్ నుండి తప్పుకున్న తర్వాత ఇప్పుడు అది మూతబడే పరిస్థితి వచ్చింది.
![Priyanka Chopra: న్యూయార్క్‌లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్ - అసలు ఏమైంది? ఎందుకు మూసేశారు? Priyanka Chopra former restaurant called SONA in New York decides to end its services Priyanka Chopra: న్యూయార్క్‌లో ప్రియాంక చోప్రా రెస్టారెంట్ క్లోజ్ - అసలు ఏమైంది? ఎందుకు మూసేశారు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/29f276bfd37ea571672aca53258146a11718945266081802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Priyanka Chopra Restaurant In New York: చాలామంది సినీ సెలబ్రిటీలు కేవలం సినిమాలపై మాత్రమే ఆధారపడకుండా ఇతర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. అలా ఇటు సినిమా, అటు బిజినెస్ మ్యానేజ్ చేస్తున్న చాలామంది సెలబ్రిటీలు సక్సెస్ అయ్యారు కూడా. అలా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది. అందులో చాలావరకు బిజినెస్‌లు ఇప్పుడు లాభాల్లో ముందుకెళ్తున్నాయి. కానీ పలు కారణాల వల్ల ప్రియాంక చోప్రా.. న్యూయార్క్‌లో ప్రారంభించిన ‘సోనా’ అనే రెస్టారెంట్ మూతబడనుందని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
సోనా ఇక లేదు..
సోనా రెస్టారెంట్ మూతబడుతుందని యాజమాన్యం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ‘‘3 ఏళ్లు గుర్తుండిపోయేలా పనిచేసిన తర్వాత సోనా క్లోజ్ అవ్వబోతుంది. మా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అందరికీ కృతజ్ఞతలు. మీకు సర్వ్ చేయడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. రోజూ రుచికరమైన ఆహారాన్ని నవ్వుతూ వేడివేడిగా అందరికీ అందిస్తున్న మా టీమ్‌కు థాంక్యూ. జూన్ 30 ఆదివారం రోజున బ్రంచ్‌తో మా సోనా సర్వీసులు ముగుస్తాయి. మిమ్మల్ని ఈ చివరి మీల్ లేదా డ్రింక్ కోసం కలుస్తామని ఆశిస్తున్నాం. మా తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచే ఉంటాయి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది సోనా.
View this post on Instagram
పార్ట్‌నర్‌షిప్ క్లోజ్..
రెస్టారెంట్‌ను క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ అసలు దీని వెనుక కారణం ఏంటని మాత్రం బయటపెట్టలేదు. 2021లో మనీష్ కే గోయల్ అనే బిజినెస్‌మ్యాన్‌తో చేతులు కలిపిన ‘సోనా’ను ప్రారంభించింది ప్రియాంక చోప్రా. విదేశాల్లో ఇండియన్ కల్చర్‌కు, ఇండియన్ ఫుడ్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. దానినే బిజినెస్‌గా మార్చుకుంది ప్రియాంక. సోనాలో ఎక్కువగా ఇండియన్ డిషెస్‌నే కస్టమర్లకు అందించేవారు. గోవాన్ ఫిష్ కర్రీ, ల్యాంబ్ చాప్స్, కుల్ఫీ ఫలూదా, సాఫ్రాన్ జిలేబీ.. లాంటి వంటకాలు అక్కడ చాలా ఫేమస్ అయ్యాయి. వీటికోసం కస్టమర్లు మళ్లీ మళ్లీ రావడం మొదలుపెట్టారు. ఎందుకో తెలియదు కానీ 2023లో ఈ రెస్టారెంట్ పార్ట్‌నర్‌షిప్ నుంచి ప్రియాంక తప్పుకుంది. అప్పటి నుంచి ఆ హోటల్ నిర్వహణ.. ఆమె బిజినెస్ పార్టనర్‌కు కష్టంగా మారినట్లు తెలుస్తోంది.
కారణం చెప్పలేదు..
ప్రియాంక చోప్రా తప్పుకున్న తర్వాత మనీష్ కే గోయల్ మాత్రమే సోనాను చూసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రెస్టారెంట్ క్లోజ్ అవుతుందనే వార్త రెగ్యులర్ కస్టమర్లకు బాధిస్తోంది. అందుకే వారంతా సోషల్ మీడియాలో అసలు ఏం జరిగింది? ఎందుకిలా చేస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, కానీ సోనా క్లోజ్ అవ్వడం మాత్రం బాధాకరమని వాపోతున్నారు. ఇక ఈ రెస్టారెంట్ క్లోజ్ అవ్వడం వెనుక కారణాన్ని మనీష్ సైతం బయటపెట్టలేదు. కానీ ఈ వ్యాపారంలో తనకు తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నారు.
Also Read: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీసులో చోరీ - అవన్నీ ఎత్తుకుపోయారట, సీసీటీవీ కెమేరాకు చిక్కిన దొంగలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)