అన్వేషించండి

Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీసులో చోరీ - అవన్నీ ఎత్తుకుపోయారట, సీసీటీవీ కెమేరాకు చిక్కిన దొంగలు

Anupam Kher: బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన అనుపమ్ ఖేర్ ఆఫీసులో చోరీ జరిగింది. లాకర్‌ను ఓపెన్ చేయలేకపోయిన దొంగలు దానిని ఎత్తికెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

Anupam Kher: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఆఫీసులో చోరీ జరిగింది. బుధవారం రాత్రి దొంగలు.. ఆయన ఆఫీస్ డోరును పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. వారు ఒక లాకర్‌ను మొత్తం ఎత్తికెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ లాకర్‌లో అనుపమ్ ఖేర్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన నెగిటివ్స్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా ఉన్నాయని ఈ నటుడు స్వయంగా ప్రకటించారు. ఈ విషయం గురించి చెప్తూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో తన ఆఫీస్ డోర్లకు ఉన్న తాళాలను ఎలా పగలగొట్టారో చూపించారు. అంతే కాకుండా దొంగతనానికి సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకున్నారు అనుపమ్ ఖేర్.

ఆటోలో పారిపోయారు..

‘గత రాత్రి వీర దేశాయ్ రోడ్‌లోని నా ఆఫీస్‌కు ఉన్న రెండు తలుపులను ఇద్దరు దొంగలు బద్దలుకొట్టారు. వాళ్లు అకౌంట్స్ డిపార్ట్మెంట్‌లో ఉండే ఒక లాకర్‌ను మొత్తం ఎత్తుకెళ్లిపోయారు. వాళ్లు దానిని బద్దలుకొట్టలేక ఈ పని చేసుంటారు. మా కంపెనీ నిర్మిస్తున్న ఒక సినిమాకు సంబంధించిన నెగిటివ్స్ అన్నీ ఆ బాక్స్‌లో ఉన్నాయి. మేము ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశాం. దొంగలను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు పరిశీలించిగా వారిద్దరూ ఒక ఆటోలో పారిపోయినట్టు తెలిసింది. వారికి దేవుడు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదిస్తే బాగుంటుంది. పోలీసులు వచ్చే ముందు మా ఆఫీస్ వాళ్లు ఈ వీడియోను తీశారు’ అంటూ వీడియోను షేర్ చేశారు అనుపమ్ ఖేర్.

రంగంలోకి పోలీసులు..

ఒక యాక్టర్ అయిన అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగలు చొరబడి లాకర్‌ను ఎత్తుకెళ్లడం అనే వార్త బీ టౌన్‌లో వైరల్ అయ్యింది. అంత జాగ్రత్తగా ఉన్నా కూడా అసలు దొంగలు ఎలా వచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయినా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది కాబట్టి పోలీసులు.. త్వరలోనే దొంగలను పట్టుకుంటారని వారు అనుకుంటున్నారు. లాకర్‌లో సినిమాకు సంబంధించిన నెగిటివ్స్‌తో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని బయటపెట్టిన అనుపమ్ ఖేర్.. అవేంటి అని మాత్రం చెప్పలేదు. దీంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

టాలీవుడ్‌లో బిజీ..

అనుపమ్ ఖేర్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. హిందీలో కూడా మళ్లీ ఈ నటుడు బిజీ అయ్యారు. ఆయన చివరిగా వీకే ప్రకాశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాగజ్ 2’లో కనిపించారు. ఇది మలయాళ చిత్రం అయిన ‘నిర్ణయకం’కు రీమేక్‌గా తెరకెక్కింది.

Also Read: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా బ్యాక్‌డ్రాప్‌ అదేనా?

టాప్ హెడ్ లైన్స్

NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Eshwar Sai Reaction : నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
నేను చేసింది తప్పే - వివాదం తర్వాత ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్
Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget