Priyadarshi: ప్రియదర్శి హీరోగా మరో సినిమా - హీరోయిన్‌గా ఫేమస్ కంటెంట్ క్రియేటర్, డీటెయిల్స్ తెలుసా?
Priyadarshi New Movie: ప్రియదర్శి వెర్సటైల్ ఆర్టిస్ట్. అవసరం అయితే కీ రోల్, కమెడియన్ రోల్ చేస్తారు. హీరోగానూ నటిస్తారు. ఇప్పుడు ఆయన హీరోగా మరో సినిమా తెరకెక్కుతోందని తెలిసింది.
Priyadarshi Pulikonda turns mail lead again for GA2 Pictures: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో ప్రియదర్శి పులికొండ ఒకరు. తనను తాను ఓ ఇమేజ్ ఛట్రంలో బందించుకొని నటుడు. స్టార్స్, యంగ్‌స్టర్స్ అని తేడాలు చూడరు. కీ రోల్, కమెడియన్ అని లెక్కలు వేసుకోరు. మంచి క్యారెక్టర్ వస్తే ఎవరి సినిమాలో అయినా నటిస్తారు. మంచి కథలు వస్తే కథానాయకుడిగానూ చేస్తారు.
ప్రియదర్శి పులికొండ లేని 'మల్లేశం', 'జాతి రత్నాలు', 'బలగం', రీసెంట్ 'డార్లింగ్' సినిమాలను ఊహించగలమా? ఇప్పుడు ఆయన హీరోగా మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతోంది. అందులో కథానాయిక ఎవరో తెలుసా?
ప్రియదర్శి సరసన నిహారిక ఎన్ఎమ్!
Priyadarshi and Niharika NM pair up together for Telugu film: నిహారిక ఎన్ఎమ్... ఈ పేరు తెలుసు కదా! సోషల్ మీడియాలో ఫేమస్ కంటెంట్ క్రియేటర్. అడివి శేష్ 'మేజర్' కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో, 'కేజీఎఫ్' విడుదల సమయంలో యశ్, ఇంకా పలువురు హీరోలతో ప్రమోషనల్ వీడియోలు చేశారు. ఇప్పుడీ అమ్మాయి మెయిన్ లీడ్ అవుతోంది.
View this post on Instagram
నిహారికా ఎన్ఎమ్ (Niharika NM Turns Main Lead)ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ సంస్థకు చేసిన జీఏ2 పిక్చర్స్ అనౌన్స్ చేసింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెష్ చెబుతూ సినిమా అనౌన్స్ చేశారు. అందులో హీరో ఎవరో కాదు... ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ కమ్ హీరో ప్రియదర్శి.
ప్రియదర్శి తమ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నట్లు జీఏ2 పిక్చర్స్ సంస్థ త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. హీరోగా అతనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించాయి.
Also Read: అఫీషియల్... 'భారతీయుడు 2' ఓటీటీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
ప్రియదర్శి కథానాయకుడిగా చేసే సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. కమెడియన్ నుంచి హీరోలుగా మారిన కొందరు యాక్షన్ సీన్స్ వైపు మొగ్గు చూపారు. కానీ, ప్రియదర్శి అలా కాదు. క్యారెక్టర్ అర్థం చేసుకుని, ఆ పరిధి మేరకు నటిస్తారు. అందువల్ల, ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. మరి, కొత్త సినిమా ఎలా ఉండబోతుందో?
ప్రియదర్శి కామెడీ టైమింగ్, నిహారిక ఎన్ఎమ్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ టైమింగ్ కలిస్తే ప్రేక్షకులకు నవ్వుల పండగే. అన్నట్టు... ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన 'డార్లింగ్' ఈ నెల 13వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?