Aadujeevitham OTT: ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేస్తున్న 'ఆడు జీవితం' - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
Aadu jeevitham OTT Release Date: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది గోట్ లైఫ్' (తెలుగులో ఆడు జీవితం). ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.
Prithviraj Sukumaran Aadujeevitham OTT Release Date Fix: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది గోట్ లైఫ్'. తెలుగులో 'ఆడు జీవితం'(Aadujeevitham OTT ) పేరుతో విడుదలైంది. ఈ ఏడాది మార్చి 28న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపించింది. మలయాళంలో ఈ మూవీ సంచలన విజయం సాధించింది. అతి తక్కువ టైంలోనే రూ. 100 కోట్ల గ్రాస్ చేసిన తొలి మలయాళ సినిమాగా 'ఆడుజీవితం' నిలిచింది. మొత్తం థియేట్రికల్ రన్‌లో 'ఆడు జీవితం' వరల్డ్ వైడ్‌గా రూ.150కి పైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా డిజిటల్ ప్రీమయర్ కోసం మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Aadujeevitham OTT Release: ఈ చిత్రం విడుదలైన మూడు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొన్నటి వరకు ఈ మూవీ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో వస్తుందన్నారు. కానీ 'ఆడు జీవితం' ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. మంచి ఫ్యాన్సీ డీల్‌కి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది. జూలై 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ తీసుకువస్తున్న నెట్‌ఫ్లిక్స్ వెల్లడింది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానుంది. రిలీజైన మూడు నెలలకు మూవీ ఓటీటీకి వస్తుండటంతో మూవీ లవర్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియాగా విడుదలైంది ఈ సినిమా. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ యువకుడు నజీబ్ ఎడారి దేశంలో ఎన్ని కష్టాలు పడ్డాడేనేది 'ఆడు జీవితం' కథ. ఇందులో పృథ్వీరాజ్.. నజీబ్ అనే యువకుడి పాత్ర పోషించగా అతడి భార్య పాత్రలో అమలా పాల్ నటించింది. ఇక ఈ సినిమాను ప్రారంభించిన 16 ఏళ్లకు మూవీ రిలీజ్ అవ్వడం విశేషం. ఎప్పుడో 2008లో స్క్రిప్ట్ అనుకోగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోవడానికి పదేళ్లు పట్టింది. 2008 నుంచి 2018 వరకు ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌ని జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాదికి రిలీజైంది.
Also Read: ఓటీటీకి వచ్చేస్తోన్న కమల్ హాసన్ 'భారతీయుడు' - మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్, ఎక్కడంటే..!