Prince Cecil: ప్రిన్స్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్... మూడు నెలల్లో తీయాలని!
Prince New Movie: కథానాయకుడిగా, విలన్‌గా తనదైన నటనతో ప్రేక్షకులను ప్రిన్స్ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా కొత్త సినిమా రూపొందుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...

దర్శకుడు తేజ తీసిన 'నీకు నాకు డాష్ డాష్'తో ప్రిన్స్ హీరోగా పరిచయం కాగా... ఆ తర్వాత మారుతి తీసిన 'బస్ స్టాప్'తో విజయం అందుకున్నారు. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాల్లో నెగిటివ్ షేడ్ రోల్స్ చేసి మెప్పించారు. హీరోగా చేయడంతో పాటు కీలకమైన క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రిన్స్ హీరోగా కొత్త సినిమా మొదలైంది.
ప్రిన్స్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!
ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరో హీరోయిన్లుగా లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పతాకం మీద కుమార్ రవికంటి ఓ సినిమా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందులో సునైనా, 'నెల్లూరు' సుదర్శన్ ప్రధాన తారాగణం. కుమార్ రవికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేఎల్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి 'బేబీ' దియా రవికంటి క్లాప్ ఇవ్వగా... శ్రీమతి సుమ రవికంటి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బేబీ మాయ రవికంటి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
Also Read: అనుష్కతో విక్రమ్ ప్రభు పెళ్లి... లిరిసిస్ట్‌గా మారిన క్రిష్... 'సైలోరే' రాసింది దర్శకుడే
సినిమా ప్రారంభమైన సందర్భంగా కుమార్ రవికంటి మాట్లాడుతూ... ''జూన్, జూలై, ఆగస్టు... మూడు నెలల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేసి సినిమాను పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. విదేశాలలో పాటలు తీయాలని ప్లాన్ చేస్తున్నాం. అద్భుతమైన సాంకేతిక విలువలతో సినిమా రూపొందిస్తున్నాం. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అలాగే, ఇందులో చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా రూపొందిస్తాం'' అని అన్నారు.
Also Read: తమిళ హీరోలకు మనం హిట్స్ ఇస్తే... మనకు ఏమో తమిళ దర్శకుల నుంచి డిజాస్టర్లు!
ప్రిన్స్, సుహాన ముద్వాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సునైనా, 'నెల్లూరు' సుదర్శన్, సతీష్ సారెపల్లి, శ్రీమని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్, రచన - నిర్మాణం - దర్శకత్వం: కుమార్ రవికంటి, ఛాయాగ్రహణం: జి. అమర్, మాటలు: భవాని ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అర్జున్ సూరిశెట్టి.





















