అన్వేషించండి

RGV : ఓటీటీలో 'వ్యూహం', 'శపథం' - మా అసలు వ్యూహం అదే అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన!

RGV : 'వ్యూహం', 'శపథం' సినిమాలకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Press Note From Ram Gopal Varma :  టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఈమధ్య ఎక్కువగా పొలిటికల్ బయోపిక్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈయన తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలను విడుదల చేద్దామని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయినా కానీ వర్మ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మార్చి 8న 'వ్యూహం' సినిమాని విడుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి తరుణంలో వర్మ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు.

'వ్యూహం', 'శపథం'.. ఓటీటీలో మరో వెర్షన్..

'వ్యూహం' సినిమా పలు వాయిదాల అనంతరం మార్చి 8న విడుదల చేస్తామని టీం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారమే సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ప్రమోషన్స్ లేకపోవడంతో మరోసారి వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నా సమయంలో రాంగోపాల్ వర్మ ఓ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే.. 'వ్యూహం', 'శపథం' సినిమాలను ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

రామ్ గోపాల్ వర్మ ప్రెస్ నోట్ లో ఏముంది?

" వ్యూహం శపథం సినిమాల వెనక మా అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ కూడా తీయడం. వేరువేరు అడ్డంకుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డ్ అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము మొదటినుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ 'శపథం' ఆరంభం చాప్టర్-1 ని ఈరోజు సాయంత్రం మార్చి 7 న 8 గంటలకు అలాగే 'శపథం' అంతం చాప్టర్- 2 ని రేపు మార్చి 8 సాయంత్రం 8 గంటలకు ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఫైబర్ నెట్ ఓటీటీ యాప్ ద్వారా పే ఫర్ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆ తర్వాత అంచలవారిగా అన్ని ఫార్మాట్స్లో రిలీజ్ అవుతాయి. 'శపథం' ఆరంభం చాప్టర్- 1, 'శపథం' అంతం చాప్టర్-2 రెండు కూడా తీసిన ఉద్దేశం.. ఏమీ దాచకుండా పచ్చి నిజాలు చూపించడానికి మాత్రమే" అంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. 

అవేమి 'వ్యూహం' లో ఉండవు - దాసరి కిరణ్ కుమార్

కాగా రాంగోపాల్ వర్మ తీసిన 'వ్యూహం', 'శపథం' సినిమాలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ఫేవర్ గా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవలే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంతో వ్యూహం సినిమా ఉంటుందని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలిపారు. ఇందులో యదార్థ ఘటనల స్పూర్తిగా ఫిక్షనల్ కథను చూస్తారు. మన పేపర్స్, టీవీ, యూట్యూబ్ లో చూసిన విషయాలేవీ వ్యూహంలో ఉండవు. ఆ ఘటనల వెనక దాగి ఉన్న కుట్రలు, కుతంత్రాలు, నిజాలతో వర్మ వ్యూహం సినిమాను రూపొందించారు" అని చెప్పారు.

Also Read : మైనస్ 40 డిగ్రీస్‌లో ‘గామి’ షూటింగ్, అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు: చాందిని చౌదరి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు
Look Back 2024 - Celebrity Divorce: పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
పెటాకులైన పెళ్లిళ్లు... 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Embed widget