News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'హనుమాన్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ!

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటిస్తున్న 'హనుమాన్' మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ ని వినాయక చవితి నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

FOLLOW US: 
Share:

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ లో తన క్రియేటివ్ మేకింగ్ టాలెంట్ తో డైరెక్టర్గా సపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ డైరెక్టర్ ఫస్ట్ మూవీ 'అ!' ఎవరికి అర్థం కాకపోయినా ఓ సరికొత్త ప్రయత్నంతో మెప్పు పొందాడు. ఆ తర్వాత రాజశేఖర్ తో 'కల్కి' మూవీ తీసి తనలోని మేకింగ్ టాలెంట్ ని చూపించాడు. అనంతరం యంగ్ హీరో తేజ సజ్జాతో చేసిన 'జాంబిరెడ్డి' ఒక్కసారిగా డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ క్రేజ్ పెంచేసింది. ఈ మూవీలో ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, మేకింగ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకుంది.

ఇక అదే తేజ సజ్జాతోనే ఇప్పుడు 'హనుమాన్'(Hanu-Man) మూవీ తీస్తున్నాడు. టాలీవుడ్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిలింగా 'హనుమాన్' రూపొందుతోంది. అనౌన్స్మెంట్ తోటే ఈ ప్రాజెక్టుపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. నిజానికి సినిమా ఎప్పుడో పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఆగుతున్నారు. కొన్ని నెల క్రితం విడుదలైన ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ కంటే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పరంగా అనేక రేట్లు బెటర్ అనిపించుకుంది 'హనుమాన్' టీజర్. మినిమం బడ్జెట్ తోనే భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. టీజర్‌తో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరిపోయాయి.

దీంతో అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. టీజర్ తర్వాత ఈ మూవీ నుంచి ఎలాంటి హడావిడి కనిపించలేదు. ఈ విషయంలో మేకర్స్ లో కొంత నిరుత్సాహం కనిపించింది. కానీ ఫైనల్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హనుమాన్'కి సంబంధించి సరికొత్త అప్డేట్ ఇచ్చాడు. "హనుమాన్ ప్రమోషన్స్ ను ఈ వినాయక చవితి నుంచి ప్రారంభిస్తున్నాం" అని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

ఆరోజు సినిమా నుంచి ఏదైనా పాట లేదా వినాయకుడి గురించి థీమ్ వీడియో విడుదల చేస్తారని టాక్  వినిపిస్తోంది. మొత్తానికి 'హనుమాన్' సందడి ఈ వినాయక చవితి నుంచి మొదలు కాబోతుందనే విషయం తెలిసి సినీ లవర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితికి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారంటే గ్యారెంటీగా మూవీ రిలీజ్ లో ఎటువంటి మార్పు ఉండదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆగ్ర హీరోల సినిమాల రిలీజ్ లను ముందుగానే ప్రకటించి, తీరా సమయం దగ్గర పడ్డాక వాయిదా వేస్తున్నారు.

కానీ హనుమాన్ మేకర్స్ మాత్రం పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ విఎఫ్ఎక్స్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనుదీప్, కృష్ణ సౌరబ్ తో కలిసి గౌరహరి స్వరాలు సమకూరుస్తున్నారు. జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా మొత్తం 11 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

Also Read : ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ - ఆకట్టుకుంటున్న 'దిల్ సే' ట్రైలర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 13 Sep 2023 06:32 PM (IST) Tags: Teja Sajja Hanuman Movie Hanu-Man Prashanth Varma Hanuman Movie Update

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !