అన్వేషించండి

Prakash Raj : ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి సాధించడం కావాలా? పవన్ పై ప్రకాష్ రాజ్ మరో సెటైరికల్ ట్వీట్

ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ల మధ్య లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది.

Prakash Raj vs Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య చిచ్చును రాజేసింది. పవన్ ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ, జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోసారి ఆయన "ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందడం కావాలా మనకు ?" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. 

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వివాదం  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ లకు మధ్య సినిమాల పరంగా మంచి బాండింగ్ ఉంది. గతసారి జరిగిన మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేసింది. అలాగే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పై మంచు విష్ణు కామెంట్స్ కు గట్టిగానే సమాధానం చెప్పాడు ప్రకాష్ రాజ్. అలాంటిది తాజాగా లడ్డూ గొడవ కారణంగా వీళ్లిద్దరి మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పు అన్నట్టుగా మారింది. ఓవైపు పవన్ ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తుంటే, మరోవైపు ఆయనపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కల్తీ లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇప్పటికే ఇది జాతీయ స్థాయి వివాదం అన్నట్టుగా మాట్లాడొద్దని ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ కి విజయవాడలో అమ్మ వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ఇది తమ మనోభావాలకు చెందిన అంశమని, "ఆయనతో పాటు అందరికీ చెబుతున్నాను.. విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. కరెక్ట్ గా మాట్లాడితే మాట్లాడండి, లేదంటే మౌనంగా ఉండండి" అంటూ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజ్ "ఆవేశం వద్దు... నేను చేసిన పోస్ట్ ని మళ్లీ చదువు, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నాను.  తిరిగి వచ్చాక మాట్లాడదాం" అంటూ హితవు పలికాడు. 

 

పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న
కానీ ఆ తర్వాత కార్తీ వివాదం మళ్లీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. 'సత్యం సుందరం' మూవీ ఈవెంట్ లో  సెన్సిటివ్ టాపిక్ అంటూ లడ్డూ గురించి కార్తీ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన దిగొచ్చి సారీ చెప్పాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం మధ్యలో దూరి "చెయ్యని తప్పుకు ఇలా సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో" పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు. ఆ వెంటనే "ఎన్నికలలో గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకి అయోమయం" అంటూ సెటైర్ వేశారు. ఇక తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అందులో ప్రకాష్ రాజ్ మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..‌ పరిపాలనా సంబంధమైన..‌ అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్" అంటూ పోస్ట్ చేశారు. మరి ప్రకాష్ రాజ్ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also : Game Changer Second Single : నెవ్వర్ బెఫోర్ అనేలా "రా మచ్చా మచ్చా" సాంగ్ - జీన్స్ తరువాత మరో వింత - 'గేమ్ ఛేంజర్' సెకండ్ సాంగ్ గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget