Sathyaraj: 'బాహుబలి' కట్టప్పతో... ప్రభాస్ దర్శకుడి గైడెన్స్‌లో... 'బార్బరిక్' టీజర్‌లో ఆ యాంకర్‌ను చూశారా?
Tribanadhari Barbarik Teaser: 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి సమర్పణలో సత్యరాజ్ ఓ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'బార్బరిక్'. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి'లో కట్టప్ప క్యారెక్టర్ తెలుగు సత్యరాజ్ (Sathyaraj)కి ఎక్కువ పేరు తెచ్చింది. ఆ సినిమాకు ముందు తెలుగులో కొన్ని సినిమాలు చేసినా 'బాహుబలి' ఇమేజ్ పెంచింది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'త్రిబాణధారి బార్బరిక్' (Tribanadhari Barbarik). ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'ది రాజా సాబ్' తెరకెక్కిస్తున్న దర్శకుడు మారుతి సమర్పకులు. ఈ రోజు తెలుగులో టీజర్ విడుదల చేశారు.
ఆ మూడు బాణాలు ఏమిటి? వాళ్ళ క్యారెక్టర్లు ఏమిటి?
'బార్బరిక్'ను వానర సెల్యూలాయిడ్ పతాకం మీద మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, 'సత్యం' రాజేష్, క్రాంతి కిరణ్ ప్రధాన తారాగణం. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
'స్వీయ నాశనానికి మూడు ద్వారాలు ఉన్నాయి' అని డైలాగ్ మొదట వినిపించగా... టీజర్ మొదలైంది. వశిష్ఠ ఎన్ సింహ రోల్ చూస్తే... ఆయన దొంగ అని తెలుస్తోంది. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఉదయభాను తనకు కావాల్సిన వ్యక్తి చావుకో ప్రతీకారం తీర్చుకోవాలని తిరుగుతున్నట్టు ఉంది. ఆవిడ పవర్ ఫుల్ రోల్ చేశారు. బెట్టింగ్, డ్రగ్స్ వంటి అంశాలను టచ్ చేసినట్లు తెలుస్తోంది. అందరి కంటే సత్యరాజ్ క్యారెక్టర్ ఎక్కువ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. గన్ పట్టుకుని ఒకసారి, పాపతో మరొకసారి, కిరీటం ధరించి ఇంకోసారి... డిఫరెంట్ షేడ్స్ చూపించారు. 'ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడు చేయాలి', 'ఒకడు తాచు పాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కిన వాడిని కాటేయబోతోంది. మరి తొక్కించిన వాడి సంగతేంటి?' వంటి డైలాగులు ఉన్నాయి.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
'బార్బరిక్' గురించి మారుతి మాట్లాడుతూ... ''ఈ సినిమాకు నేనేమీ పని చేయలేదు. సలహాలు, సూచనలు ఇచ్చానంతే. నాకు కథ చెప్పినప్పుడు చాలా రిస్కీ జానర్ అని చెప్పేశా. మోహన్, రాజేష్ కాన్ఫిడెన్స్ ఉందన్నారు. విజయ్ గారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఆయనతో, జీ తెలుగుతో కలిసి మరో సినిమా చేస్తున్నా. మన పురాణాల్లోని ఓ పాత్ర ప్రస్తుత కాలానికి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. కథ నచ్చితే సత్యరాజ్ గారు సినిమా చేస్తారు. 'బాహుబలి' చేసిన ఆయన 'బార్బరిక్' చేయడమే కాదు... ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయనతో 'ప్రతిరోజూ పండగే' చేశా'' అని చెప్పారు.
సత్యరాజ్ మాట్లాడుతూ... ''బార్బరిక్' పక్కా కమర్షియల్ సినిమా. దర్శకుడు మోహన్ చెప్పిన కథ నచ్చింది. నా దృష్టిలో ఈ సినిమాకు కథే హీరో. ఈ సినిమాలో 'సత్యం' రాజేష్ గారు నాతో పాటే ఉంటారు. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నేను 'ఏజ్డ్ యాక్షన్ హీరో' ట్యాగ్ కోసం ట్రై చేస్తున్నా. 'బార్బరిక్'తో వస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాకు నన్ను తెలుగులో డబ్బింగ్ చెప్పమన్నారు. ఆల్రెడీ హిందీ, కన్నడ, తమిళంలో డబ్బింగ్ చెప్పా. ఈ మూవీ పెద్ద హిట్ కాబోతోంది'' అన్నారు.
Also Read: బన్నీని మళ్లీ కలిసిన కొరటాల... అప్పట్లో ఆగిన సినిమా పట్టాలు ఎక్కుతుందా? స్టేటస్ ఏమిటంటే?