అన్వేషించండి

Prabhas New Movie : 'బాహుబలి' నిర్మాతలతో ప్రభాస్ సినిమా - ఎప్పుడూ చేయని క్యారెక్టర్‌తో?

ప్రభాస్ పాన్ ఇండియా / వరల్డ్ స్టార్ అయ్యారంటే కారణం 'బాహుబలి'. ఇప్పుడు ఆ సినిమా నిర్మాతలతో ప్రభాస్ ఓ సినిమా చేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం.

ఇప్పుడు ప్రభాస్ (Prabhas) తెలుగు హీరో మాత్రమే కాదు... పాన్ ఇండియా స్టార్! ఈ ఇమేజ్, స్టార్ స్టేటస్ ఆయనకు రావడానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) తీసిన 'బాహుబలి'. ఆ సినిమాకు ముందు ప్రభాస్ స్థాయి వేరు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి వేరు. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకు అంటే... 'బాహుబలి' నిర్మాతలతో ప్రభాస్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట!

స్టోరీ ఫైనలైజ్ చేసిన ప్రభాస్ & ప్రొడ్యూసర్స్!
'బాహుబలి'ను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఆ సినిమా తర్వాత హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థల్లో ప్రభాస్ ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే... 'బాహుబలి' నిర్మాతలతో ఓ సినిమా విషయమై చర్చలు చేస్తూ వచ్చారట. ఇప్పటికి ఓ కథను ఫైనలైజ్ చేశారట. 

'బాహుబలి' విడుదలైన తర్వాత నుంచి ప్రభాస్, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చాలా కథలు విన్నారట. వాటిలో నుంచి ఓ కథను ఇటీవల ఫైనలైజ్ చేశారట. ఆ కథలో హీరో క్యారెక్టర్ ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన ఏ పాత్రతో పోల్చి చూసినా సరే సంబంధం ఉండదట. కొత్త తరహా పాత్రలో ప్రభాస్ కనబడతారని, 'బాహుబలి' కంటే ఇది డిఫరెంట్ సినిమా అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

Also Read సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?

ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలకు వస్తే... ఆయన చేతిలో నాలుగు ఐదు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో 'ఆదిపురుష్' చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యింది. 'సలార్' చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం మారుతి సినిమా షూటింగ్ చేస్తున్నారు ప్రభాస్. ఇంకా సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగా సినిమాలు లైనులో ఉన్నాయి. మారుతి సినిమాకు 'రాజా డీలక్స్' టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఆ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. 

రెండు భాగాలుగా 'సలార్'
ఆల్రెడీ 'ఆదిపురుష్' ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఆ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. దాని తర్వాత 'సలార్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

Also Read : తెలుగులో బుజ్జి కన్నా - నిర్మాత తనయుడితో 'లవ్ టుడే' హీరోయిన్

'సలార్' సినిమా ఒక భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రెండు పార్టులుగా విడుదల అవుతుందా? అని నిన్న మొన్నటి వరకు సందేహాలు నెలకొన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ గానీ, ప్రభాస్ గానీ, నిర్మాతలు గానీ ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నడ నటుడు దేవరాజ్ 'సలార్' రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిపారు. 

'అర్జున్ రెడ్డి' దర్శకుడి సినిమాలో పోలీస్ గా... 
'అర్జున్ రెడ్డి'తో తెలుగులో, ఆ సినిమా హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' సినిమాతో నార్త్ ఇండియాలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా 'స్పిరిట్'. అందులో హీరోది పోలీస్ రోల్. కాప్ డ్రామాగా సినిమా రూపొందుతుందని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు
Embed widget