Spirit: 'స్పిరిట్'లో మలయాళ యాక్షన్ హీరో... సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్... షూటింగ్ ఆలస్యానికి కారణం ఇదేనా?
Spirit : ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీలో ఓ మలయాళ స్టార్ హీరోను కీ రోల్ కోసం మేకర్స్ సంప్రదించినట్టు సమాచారం.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో 'స్పిరిట్' (Spirit) కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిబోతున్న ఈ మూవీని ప్రకటించి చాలా కాలమే అవుతుంది. కానీ ఇప్పటిదాకా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంకా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ కోసం ఓ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరోని రంగంలోకి దింపుతున్నారు అని తెలుస్తోంది.
'స్పిరిట్'లో మలయాళ స్టార్
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'యానిమల్' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ... బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోతున్నారు. ఈ మూవీకి 'స్పిరిట్' అనే టైటిల్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలోనే 'స్పిరిట్' మూవీ షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఇంకా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆయన నటీనటుల ఎంపికలో నిమగ్నం అయిపోయినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీలోని ఓ కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan)ను సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ ఆయన ఈ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదా? అన్నది ఇంకా సస్పెన్స్ లో ఉంది. ఉన్ని ముకుందన్ గత ఏడాది చివర్లో 'మార్కో' అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నారు. ఈ మూవీ జనవరి 1 న తెలుగులో కూడా రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
స్పిరిట్ మూవీ ఆలస్యానికి కారణం ఇదేనా?
ఇక మరోవైపు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'స్పిరిట్' మూవీ షూటింగ్ రోజుకు మరింత ఆలస్యం కావడం ప్రభాస్ అభిమానులను నిరాశ పరుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'స్పిరిట్' మూవీ ఆలస్యం కావడానికి హీరో ప్రభాస్ తో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా కారణం అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి - ప్రభాస్ ఇద్దరూ కంప్లీట్ గా ఈ ఒక్క మూవీపైనే ఫోకస్ పెట్టి, పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అందుకే మిగతా సినిమాల షూటింగులను పూర్తి చేసి, ఆ తర్వాత 'స్పిరిట్' సెట్స్ లో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.
Also Read: హీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?
అందుకే ప్రభాస్ ఇప్పటికే చేపట్టిన 'ది రాజా సాబ్', హను రాఘవపూడి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ప్రభాస్ 'స్పిరిట్' సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. ఇక ఈ మూవీ ఆలస్యానికి మరో కారణం ఏంటంటే 'స్పిరిట్'లో ప్రభాస్ రెండు రకాల లుక్స్ లో కనిపించబోతున్నారని అంటున్నారు. ఆ రెండు లుక్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి, ప్రభాస్ ఈ ఒక్క మూవీని పూర్తి చేసేదాకా మరో మూవీ జోలికి వెళ్లొద్దనే ఆలోచన కూడా ఈ మూవీ ఆలస్యానికి మరో కారణం. కాగా టీ సిరీస్, శ్రీ భద్రకాళి ఫిలిమ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'స్పిరిట్' మూవీ 2027 ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

