Salaar Special Shows: ప్రభాస్ సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపునకు ఓకే! స్పెషల్ షో థియేటర్లు ఇవీ
Salaar Part 1 Special Shows in Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా స్పెషల్ షోలకు అనుమతి లభించింది. టికెట్ల పెంపునకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
![Salaar Special Shows: ప్రభాస్ సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపునకు ఓకే! స్పెషల్ షో థియేటర్లు ఇవీ Prabhas Salaar Special Shows ticket price confirmed special shows details Salaar Special Shows: ప్రభాస్ సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపునకు ఓకే! స్పెషల్ షో థియేటర్లు ఇవీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/19/99eec1995565f8970e10c2d58b9921cb1702991270101233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salaar Special Shows in Hyderabad: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సలార్ సినిమాపై అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. డిసెంబర్ 22న విడుదల కానున్న సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ స్పెషల్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 21న అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 4 గంటల షోకు సైతం అనుమతి ఇవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు టికెట్ రేట్ల పెంపుపై సైతం అనుమతి లభించింది.
తెలంగాణలో వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి లభించగా... ఏపీలో 10 రోజులపాటు 40 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి లభించింది. డిసెంబర్ 22 నుంచి 28 వరకు టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో రూ. 370, రూ.470 ధరతో టికెట్ రేట్లు ఉండేలా కనిపిస్తోంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.65 పెంచుకునేందుకు, మల్టీఫెక్స్ ల్లో రూ.100 తొలి వారం రోజులు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ధరలు కన్ఫామ్ కావడంతో పలు బుకింగ్ ప్లాట్ ఫాంలలో సలార్ పార్ట్ 1 మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో కొన్ని స్క్రీన్లలో స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు. ఆ థియేటర్లు ఇవీ..
1) Nexus Mall, Kukatpally
2) AMB cinemas, Gachibowli
3) Brahmaramba Theatre, Kukatpally
4) Mallikarjuna Theatre, Kukatpally
5) Arjun Theatre, Kukatpally
6) Viswanath Theatre, Kukatpally
7) Sandhya 70MM, RTC X Roads
8) Sandhya Theatre 35MM, RTC X Roads
9) Rajadhani Deluxe, Dilsukhnagar
10) Sriramulu Theatre, Moosapet
11) Gokul Theatre, Erragadda
12) Sri Sai Ram Theatre, Malkajgiri
13) SVC Tirumala Theatre, Khammam
14) Vinoda Theatre, Khammam
15) Venkateswara Theatre, Karimnagar
16) Nataraj Theatre, Nalgonda
17) SVC Vijaya theatre, Nizamabad
18) Venakteswara Theatre, Mahaboobnagar
19) Srinivasa Theatre, Mahaboobnagar
20) Rahdika Theatre, Warangal.
#Salaar 𝑩𝒆𝒏𝒆𝒇𝒊𝒕 𝑺𝒉𝒐𝒘 𝑻𝒉𝒆𝒂𝒕𝒓𝒆𝒔 𝑳𝒊𝒔𝒕 💥
— Suresh PRO (@SureshPRO_) December 19, 2023
1) Nexus Mall, Kukatpally
2) AMB cinemas, Gachibowli
3) Brahmaramba Theatre, Kukatpally
4) Mallikarjuna Theatre, Kukatpally
5) Arjun Theatre, Kukatpally
6) Viswanath Theatre, Kukatpally
7) Sandhya 70MM, RTC X…
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)