Salaar: ‘సలార్’ కంటే ముందే 'జూరాసిక్ పార్క్’ రిఫరెన్స్‌ను ఆ మూవీలో వాడేశారు? ఆ సినిమా పేరేంటి?
ప్రభాస్ 'సలార్' టీజర్ జూలై 6న విడుదలై అనూహ్య స్పందనను కనబరిచింది. అయితే ఈ టీజర్ లో ప్రభాస్ ను జురాసిక్ పార్క్ లో డైనోసార్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ గురించి మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.
టాలీవుడ్ అప్ కమింగ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'సలార్' టీజర్ జూలై 6న విడుదలై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 'కేజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించారు. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా టీజర్ లో ప్రభాస్ ముఖాన్ని రివిల్ చేయకుండా, ప్రభాస్ కి ఎలివేషన్ ఇస్తూ నటుడు టీను ఆనంద్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ టీజర్ లో నటుడు టీను ఆనంద్ ప్రభాస్ ను జురాసిక్ పార్క్ లోని డైనోసార్ తో పోల్చాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ ని ఎలివేట్ చేయడం కోసం జురాసిక్ పార్క్ రిఫరెన్స్ ని ఉపయోగించాడు. అయితే ఈ రిఫరెన్స్ ని 'సలార్' డైరెక్టర్ కంటే ముందు మరో అగ్ర దర్శకుడు ఉపయోగించారనే విషయం మీకు తెలుసా? ఆ డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా పేరేంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా విడుదలైన 'సలార్' టీజర్ లో సినిమా రెండు భాగాలుగా వస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. అయితే ఈ టీజర్ లో ప్రభాస్ ని జురాసిక్ పార్క్ లో ఉన్న డైనోసార్ తో పోల్చారు. సింహం, చిరుత, పులి, ఏనుగు ప్రమాదకరమని, అయితే అవి జురాసిక్ పార్క్‌లో ఉన్నప్పుడు కాదని టీను ఆనంద్ చెప్పారు. ఆ తర్వాత ప్రభాస్ గొడ్డలి, కత్తి, తుపాకులు పట్టుకుని రౌడీలను కొడుతున్న విజువల్స్ ని టీజర్ లో చూపించారు.
అయితే ఈ జురాసిక్ పార్క్ రిఫరెన్స్ ని గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సైతం వినియోగించారు. ఆయన తెరకెక్కించిన 'ప్రేమికుడు' సినిమాలో ఈ జురాసిక్ పార్క్ రిఫరెన్స్ ఉంటుంది. ప్రేమికుడు సినిమాలో 'ముక్కాలా ముక్కాబుల' పాట ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. ఈ పాటలో "జురాసిక్ పార్క్ లోనా సరదాగా జోడీలే జాజ్ మ్యూజిక్ నేడే పాడేను".. అనే లిరిక్ ఉంటుంది. దర్శకుడు శంకర్ సరదాగా సాగే పాటలో ఈ జురాసిక్ రిఫరెన్స్ ని వాడితే, అదే రిఫరెన్స్ ని ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలివేట్ చేయడం కోసం వాడారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జురాసిక్ పార్క్ రిఫరెన్స్ ప్రస్తావన వైరల్ గా మారింది. అయితే టీజర్ వచ్చాక జురాసిక్ పార్క్ రిఫరెన్స్ డైలాగ్ ను కొందరు నెటిజెన్లు ట్రోల్ చేస్తే.. మరి కొంతమంది ప్రభాస్ కటౌట్ కి ఈ డైలాగ్ సరిగ్గా సూట్ అవుతుందంటూ కామెంట్స్ చేశారు.
ఇక సలార్ విషయానికొస్తే.. తాజాగా విడుదలైన ‘సలార్’ టీజర్ 24 గంటల్లో ఏకంగా 85 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఈ రేంజ్ రెస్పాన్స్ మరే స్టార్ హీరో సినిమా టీజర్ కి రాకపోవడం గమనార్హం. ఈ టీజర్ రెస్పాన్స్ ని బట్టి ప్రభాస్ సలార్ కోసం ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 'కేజీఎఫ్' సినిమాను నిర్మించిన హోం బలే ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో స్థాయిలో నిర్మించగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : షారుక్ 'జవాన్' నుంచి లీకైన నయనతార లుక్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial