Salaar Movie: ‘సలార్’ వచ్చేస్తున్నాడు - మరో వంద రోజుల్లో బాక్స్ ఆఫీస్ ఊచకోత!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ తో రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్ ‘సలార్’ తో తన రికార్డులను తానే తిరగరాసుకోవడానికి సిద్దమవుతున్నారు...
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ మూవీలు ఎలాంటి భారీ హిట్ ను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ‘బాహుబలి’ లాంటి సన్సేసనల్ సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. అలాంటి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది. అదే.. ‘సలార్’. ఈ మూవీ భారీ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ భారీ ప్రాజెక్టు నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ ఇంకా వంద రోజులే ఉందంటూ ఓ పోస్ట్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ మొదలవుతోంది.
బాక్స్ ఆఫీస్ ఊచకోతకు ఇంకో వంద రోజులే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ తో రికార్డులు సృష్టిస్తోన్న ప్రభాస్ ‘సలార్’ తో తన రికార్డులను తానే తిరగరాసుకోవడానికి సిద్దమవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ‘సలార్’ పై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ లాంటి సినిమాలతో ప్రశాంత్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయన సినిమాల్లోని హీరో ఎలివేషన్లు చూసి ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయింది. ఇలా కూడా సినిమాలు తీస్తారా అనే రేంజ్ లో స్క్రేన్ ప్లే ఉంటుంది ప్రశాంత్ సినిమాల్లో. అందుకే ఈ ‘సలార్’ మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఒక కన్నడ హీరోకి ఇచ్చిన ఎలివేషన్లకే తెలుగులో కూడా భారీ వసూళ్లు వచ్చాయి. మరి అలాంటిది ప్రభాస్ లాంటి హీరోలకు ఇచ్చే ఎలివేషన్లకు ఎలాంటి వసూళ్లు వస్తాయో అంచనా వేయడం కూడా కష్టమే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘100 డేస్ టు విట్నెస్’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు మూవీను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ను జూన్ చివరి వారంలో గానీ లేదా జూలై మొదటి వారంలో గానీ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కరెక్ట్ టైమ్ లో అప్డేట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ సంబరాలు..
ప్రభాస్ నటించిన గత రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. ఈ మూవీల తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్ల పరంగా బాగున్నా సినిమా టేకింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మూవీ విడుదల అయిన నాలుగు రోజులు అవుతున్నా మూవీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ప్రభాస్ లుక్ పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన నటించిన తదుపరి మూవీ ‘సలార్’ గురించి అప్డేట్ రావడంతో మళ్లీ కాలర్ ఎగరేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊతకోత గ్యారెంటీ అంటున్నారు. ‘ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తేనే రికార్డు స్థాయి ఓపినింగ్స్ ఇచ్చాం.. మరి ‘సలార్’ లాంటి ఎలివేషన్స్ మూవీకు రికార్డులను తిరగరాసే విధంగా కలెక్షన్స్ ఇస్తాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ మూవీను రెండు పార్ట్ లుగా తీస్తారా లేదా ఒక పార్ట్ తోనే సరిపెడతారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, శరణ్ శక్తి తదితరులు నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 28, 2023 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Time to give the world the CPR it needs. Get ready for #Salaar on Sep 28, 2023🔥#Prabhas #PrashanthNeel #VijayKiragandur @hombalefilms @PrithviOfficial @shrutihaasan @bhuvangowda84 @RaviBasrur @SalaarTheSaga pic.twitter.com/Nd3Yl79Yhq
— Salaar (@SalaarTheSaga) June 20, 2023