News
News
X

Prabhas Maruthi Movie Update : నెలాఖరు నుంచి మళ్ళీ సెట్స్ మీదకు ప్రభాస్ & మారుతి

రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ ఈ నెలాఖరుకు తిరిగి వస్తారని సమాచారం. వచ్చిన వెంటనే మారుతి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

FOLLOW US: 
Share:

రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోగ్యం (Prabhas Health) గురించి కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొంది. ఆయన ఈ మధ్య తరచూ అనారోగ్యం కారణంగా షూటింగులు క్యాన్సిల్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ గుసగుస. ముందుగా అనుకున్న విధంగా షెడ్యూల్స్ ప్రకారం మారుతి దర్శకత్వంలో చేస్తున్న హారర్ కామెడీ గానీ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' గానీ షూటింగ్స్ జరగడం లేదు. ఈ తరుణంలో ప్రభాస్ ఫారిన్ టూర్ న్యూస్ అభిమానులకు కాస్త ఆందోళన కలిగించేదని చెప్పాలి. 

విదేశాల్లో హెల్త్ చెకప్ కోసం... 
ఇప్పుడు ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. హెల్త్ చెకప్ కోసమే కొన్ని రోజులు షూటింగులకు బ్రేక్ ఇచ్చి వెళ్లారని టాక్. అభిమానులు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇది రెగ్యులర్ హెల్త్ చెకప్ అని ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఇటీవల ఇండియాలోని ఓ ఆస్పత్రికి వెళ్లిన ప్రభాస్‌ వైద్యుల సూచన మేరకు షూటింగులకు విరామం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలకు సంబంధించిన షెడ్యూల్స్‌ అన్నింటిని కూడా రద్దు చేశారట. ఇప్పుడు ఏకంగా విదేశాలకు వెళ్లారు. ఫిబ్రవరిలో కూడా జ్వరం కారణంగా మారుతి సినిమా షూటింగ్ కొన్ని రోజులు క్యాన్సిల్ చేశారు. 

నెలాఖరుకు ప్రభాస్ వచ్చేస్తారు
నెలాఖరుకు ప్రభాస్ విదేశాల నుంచి వచ్చేస్తారని సమాచారం. ఆయన వచ్చిన వెంటనే మారుతి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఈ నెల 25 లేదంటే ఆ తర్వాత షూటింగ్ మొదలు కావచ్చు. ఆల్రెడీ ప్రభాస్, ఇతర తారాగణం మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈసారి స్టార్ట్ చేయబోయే షెడ్యూల్‌లో హీరోయిన్స్ కూడా జాయిన్ అవుతారని తెలిసింది.

Also Read : ర్యాప్ పాడిన బాలయ్య - ఆ పన్నెండు మందికి మావయ్య

'ఆదిపురుష్' ఒకే... 
'ప్రాజెక్ట్ కె' వాయిదా?
ప్రభాస్ హెల్త్ 'ప్రాజెక్ట్ కె' విడుదలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది. అమితాబ్ బచ్చన్ కూడా గాయపడటం కారణంగా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. వాళ్లిద్దరూ కోలుకుంటేనే గానీ షూటింగ్ చేయడానికి లేదు. ఆల్రెడీ 'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రకటించిన తేదీకి సినిమా వస్తుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది థియేటర్లలోకి సినిమా వస్తే తప్ప తెలియదు. 'సలార్' విడుదల సంగతి ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు.  

జనవరి 12, 2024లో 'ప్రాజెక్ట్ కె'ను విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్.

'ప్రాజెక్ట్ కె' కంటే ముందు రెండు రిలీజులు!
'ప్రాజెక్ట్ కె' కంటే ముందు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్', 'సలార్' ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' ఈ ఏడాది జూన్ 16న విడుదల కానుంది. 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' సెప్టెంబర్ 28న విడుదల కానుంది.   

Published at : 15 Mar 2023 03:58 PM (IST) Tags: Malavika Mohanan Nidhhi Agerwal Maruthi Prabhas Prabhas News Update

సంబంధిత కథనాలు

Shah Rukh Khan  Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Shah Rukh Khan Rolls Royce: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

Jaya Janaki Nayaka Hindi Dubbed: Image Credits: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రిపతి’ రిమేక్ చేస్తున్నారా?

Jaya Janaki Nayaka Hindi Dubbed: Image Credits: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్, అందుకే ‘ఛత్రిపతి’ రిమేక్ చేస్తున్నారా?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Nidhi Agarwal: నిధి అగర్వాల్ పూజలు - అవకాశాల కోసమేనా?

Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: బాలీవుడ్ రాజకీయాలతో విసిగిపోయాను, అందుకే దూరమయ్యా: ప్రియాంక చోప్రా

టాప్ స్టోరీస్

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్