By: ABP Desam | Updated at : 15 Mar 2023 01:36 PM (IST)
‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ స్టేజ్‌పై ర్యాప్ డాన్స్ పెర్ఫామెన్స్‌తో దుమ్ము రేపిన నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లో సింగర్ కూడా ఉన్నారు. 'పైసా వసూల్' సినిమాలో ఆయన పాడిన 'మామ ఏక్ పెగ్ లా' సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సాంగ్ పాడారు. సాంగ్ అంటే సాంగ్ కాదు... ర్యాప్! అదీ 'ఆహా' ఓటీటీ సింగింగ్ రియాలిటీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' కోసం!
'ఆహా' ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించటానికి, 'ఆహా'లో సందడి చేయడానికి ఆయన రెడీ అయ్యారు. 'తెలుగు ఇండియన్ ఐడల్ 2'లో పాల్గొనబోతున్న టాప్ 12 కంటెస్టెంట్లను ఆయన పరిచయం చేయనున్నారు. ఆ సందర్భంలో ర్యాప్ పాడారు. దానికి హేమచంద్ర సంగీతం అందించారు.
''హాయ్... హలో... దిస్ ఈజ్ ఎన్.బి.కె! హే... చలో చేద్దాం... లెట్స్ రాక్! ఇది ఐడల్ చరిత్రలో బిగ్గెస్ట్ ఈవెనింగ్. ఈ సీజన్ సెట్ చేయనుంది నెవ్వర్ బిఫోర్ న్యూ ట్రెండ్! నేను మీ బాలయ్య... టాప్ 12కి మావయ్య'' అంటూ బాలకృష్ణ ర్యాప్ పాడారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని స్టైల్లో బాలకృష్ణ డ్రస్సింగ్ ఉందని చెప్పాలి.
మార్చి 17, 18 తేదీల్లో...
'ఇండియన్ ఐడల్ 2'కు బాలకృష్ణ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ మార్చి 17, 18వ తేదీల్లో స్ట్రీమింగ్ కానుందని 'ఆహా' వర్గాలు తెలిపాయి. ప్రజెంట్ ఆయన పాడిన ర్యాప్ సాంగ్ వైరల్ అవుతోంది.
ర్యాప్ పాడుతూ డాన్స్ చేయటం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ''నా హృదయానికి సంగీతం ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. రియాలిటీ సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' కార్యక్రమంలో నేను భాగం కావటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నేను ఇప్పటి వరకు ర్యాప్ పెర్ఫామెన్స్ చేయలేదు. తొలిసారి ఈ కార్యక్రమంలో ర్యాప్ పాడుతూ డ్యాన్స్ చేయబోతున్నాను. ప్రేక్షకులకు ఆ ర్యాప్, డ్యాన్స్ సర్‌ప్రైజింగ్ అనే చెప్పాలి. ఈ షోలో టాప్ 12 మందిని వీక్షకులకు పరిచయం చేయబోతున్నా. వారికి సంగీతంపై నాకు ఉన్న ప్రేమ, అనుబంధాన్ని తెలియజేస్తాను. ఆహాలో 'గాలా విత్ బాల'తో మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్‌ను సెలబ్రేట్ చేసుకుందాం'' అని చెప్పారు.
టాప్ 12 కంటెస్టెంట్లు ఎవరంటే?
Also Read : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్
'తెలుగు ఇండియన్ ఐడల్ 2'కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ (Thaman), పాపులర్ సింగర్ గీతా మాధురి, వెర్సటైల్ సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే... మార్చి 17 నుంచి ఫేవరేట్ కంటెస్టెంట్లకు ప్రేక్షకులు కూడా ఓట్లు వేయవచ్చు. పోటీలో ఎవరు ఉండాలి, ఎవరు బయటకు వెళ్లిపోవాలి అనే విషయంలో న్యాయ నిర్ణేతలులాగానే ప్రేక్షకుల వేసే ఓటింగ్ కూడా కీలకంగా మారనుంది.
Also Read : రోజుకు రెండు కోట్లు - రెమ్యూనరేషన్ రివీల్ చేసిన పవన్
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Citadel Web Series Telugu: తెలుగులోనూ ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ - స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే!
Rana Naidu Web Series: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం
నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్ఎస్ సైటర్- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్
ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!
Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!