Prabhas: ప్రతి నెల వృద్ధాశ్రమానికి డొనేషన్... రాజా సాబ్ రెమ్యూనరేషన్ తగ్గించుకున్న రెబల్ స్టార్?
Prabhas Remuneration For The Raja Saab: 'ది రాజా సాబ్' రిలీజ్ కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి, ఈ సినిమాకు ఆయన రెమ్యునరేషన్ ఎంత?

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త చిత్రం 'ది రాజా సాబ్' సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కంటే ముందే వచ్చిన రెండు ట్రైలర్లు ప్రేక్షకులలో అద్భుతమైన బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల మన బాహుబలి గురించి హృదయానికి హత్తుకునే విషయాన్ని వెల్లడించారు. ఆయన దాతృత్వాన్ని ప్రశంసించారు. ఖమ్మంలో వృద్ధాశ్రమం నిర్మాణంలో టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా సహాయం చేశారో తెలిపారు.
వృద్ధాశ్రమానికి ప్రతి నెలా విరాళం
సుమ కనకాల ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రభాస్ దాతృత్వంలో ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రస్తుత తెలంగాణలోని ఖమ్మంలో వృద్ధాశ్రమం నిర్మించడానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి పెద్ద స్టార్ల నుంచి సహాయం తీసుకున్నారని ఆమె తెలిపారు. అయితే సుమ చెప్పిన ప్రత్యేక విషయం ఏమిటంటే... ఆ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంలో సహాయం చేయడమే కాకుండా, ఇప్పటికీ ప్రతి నెలా ఆ వృద్ధాశ్రమం నిర్వహణ కోసం ప్రభాస్ విరాళాలు అందిస్తున్నారట.
ఇంకా సుమ మాట్లాడుతూ... ''ప్రభాస్ విషయం వేరు. ఆయన ఒక్కసారి సహాయం చేసి వదిలేయరు, కానీ ప్రతి నెలా వృద్ధుల కోసం నిరంతరం విరాళాలు పంపుతూ ఉంటారు. వారి నెలవారీ ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. చాలా తక్కువ మంది ఇలా చేస్తారు'' అని చెప్పారు.
Also Read: 'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
View this post on Instagram
ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత? ఆయనకు డబ్బులు ఎలా వస్తాయి?
ఫోర్బ్స్ ఇండియా 2025 ప్రకారం, ప్రభాస్ టోటల్ నెట్ వర్త్ (ఆస్తి) 241 కోట్ల రూపాయలు. అయితే... ఆయన పారితోషికంలో ఇటీవల ఒక పెద్ద మార్పు కనిపించింది. 'సియాసత్' నివేదిక ప్రకారం, ప్రభాస్ తన రాబోయే చిత్రం 'ది రాజా సాబ్' కోసం తన పారితోషికాన్ని 50 కోట్ల రూపాయలు తగ్గించుకున్నారు. ఈ చిత్రానికి ఆయనకు 100 కోట్ల రూపాయల పారితోషికం లభించింది.
Also Read: 50 ఏళ్ల వయసులోనూ మహేష్ బాబు యంగ్ లుక్ వెనుక సీక్రెట్... మెరిసే చర్మం కోసం రోజూ చేసేది ఇదే
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభాస్ 'బాహుబలి' చిత్రం కోసం కేవలం 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన తన పారితోషికాన్ని 150 కోట్లకు పెంచారు. సాధారణంగా ఆయన ఒక చిత్రానికి సుమారు 150 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. అయితే, 'కల్కి 2898 AD' వంటి చిత్రానికి ఆయన 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు.
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు





















