The Raja saab: సాంగ్ ఏది 'రాజా సాబ్'? - బర్త్ డే స్పెషల్ ఓన్లీ పోస్టరేనా?
The Raja Saab First Single: 'ది రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలోనే సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.

Prabhas Fans Disappoint To Not Release The Raja Saab Song: ఫస్ట్ సాంగ్ ఎక్కడ 'రాజా సాబ్'?. ఇదీ డార్లింగ్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్ చేస్తోన్న క్వశ్ఛన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ఆయన అవెయిటెడ్ మూవీస్ నుంచి బిగ్ సర్‌ప్రైజెస్ వచ్చేశాయి. అయితే, డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ఓ సర్‌ప్రైజ్ మాత్రం రాలేదు. అదే 'ది రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్.
స్పెషల్ పోస్టర్
రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ గురువారం రిలీజ్ అవుతుందని అంతా భావించారు. అయితే, ఓ స్పెషల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు చెప్పారు. 'సినిమాను పండుగలా మార్చే వ్యక్తి ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జనవరి 9న జరిగే అద్భుతమైన పండుగ రైడ్‌కు సిద్ధంగా ఉండండి. చూస్తూ ఉండండి. ఫస్ట్ సింగిల్ త్వరలోనే వేడుకలను హోరెత్తిస్తుంది.' అంటూ రాసుకొచ్చారు.
Team #TheRajaSaab wishes the man who turns cinema into a festival, #Prabhas a very Happy Birthday ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) October 23, 2025
Get ready for the grandest festive ride on January 9th, 2026 🔥
Stay tuned… First Single will LIT UP the celebrations soon 😎#HappyBirthdayPrabhas#TheRajaSaabOnJan9th… pic.twitter.com/ADIGloEpLU
ఈ లుక్ ఓ సాంగ్‌లో స్టిల్ అని అర్థమవుతుండగా... ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కనీసం డేట్ అయినా చెప్పాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్‌లో మూవీ చేస్తుండగా... ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌లో వింటేజ్ లుక్ అదిరిపోయింది. ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్, లుక్‌లో ఆయన కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా... రీసెంట్‌గానే కేరళలో సాంగ్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించగా... సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.
Also Read : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
సరిగ్గా ఏడాది క్రితం కూడా ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా 2 రోజుల ముందే ఓ స్పెషల్ పోస్టర్‌తో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికీ రిలీజ్ అయిన వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా... డార్లింగ్ సరసన మాళవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















