3 Roses Movie OTT: మూవీగా తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ '3 రోజెస్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
3 Roses OTT Platform: తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ '3 రోజెస్' ఇప్పుడు మూవీగా రాబోతోంది. సీజన్ 2 త్వరలోనే స్ట్రీమింగ్ కానుండగా... ఫస్ట్ సీజన్ మూవీగా అందుబాటులోకి వచ్చింది.

3 Roses Web Series As Movie OTT Streaming: రీసెంట్‌గా రిలీజ్ చేసిన రొమాంటిక్ వెబ్ సిరీస్‌ల్లో మంచి రెస్పాన్స్ అందుకున్న వెబ్ సిరీస్ '3 రోజెస్'. టాలీవుడ్ హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ ట్రెండ్ క్రియేట్ చేయగా... ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా సిరీస్ ఎపిసోడ్స్ అన్నీ కలిపి మూవీగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'3 రోజెస్' మూవీ ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. 'స్నేహం, ప్రేమ, ధైర్య హృదయాల కథ కొనసాగుతోంది. 3 రోజెస్ సిరీస్ ఇప్పుడు సినిమాగా ప్రసారం కానుంది.' అంటూ రాసుకొచ్చారు. ముగ్గురు ఫ్రెండ్స్ జీవితంలో జరిగిన సంఘటనలు, లవ్, పెళ్లి, ముద్దులాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నీ కలిపి సిరీస్‌లో చూపించారు. హర్ష చెముడు, సత్యం రాజేష్, సాయి రోనక్, సంగీత్ శోభన్, సౌరభ్ దింగ్రా, సాయి రోనక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram
ఈ సిరీస్‌కు మారుతి షో రన్నర్‌గా వ్యవహరించగా... మాగి దర్శకత్వం వహించారు. 'బేబీ' మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ నిర్మించారు. ఫస్ట్ సీజన్‌లో 8 ఎపిసోడ్స్ ఉండగా... వీటన్నింటినీ కలిపి 2 గంటల 14 నిమిషాల రన్ టైంతో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అటు సిరీస్‌తో పాటు మూవీ కూడా ఓటీటీలో ఎంటర్టైన్ చేయనున్నాయి.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ - 'కల్కి 2898AD' సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్...
త్వరలోనే సీజన్ 2
ఈ సిరీస్ సీజన్ 2 కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన స్పెషల్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ సిరీస్‌ను మించి రెండో సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ సీజన్‌లో మరో ఇద్దరు కొత్త హీరోయిన్లు నటించనున్నారు.
స్టోరీ ఏంటంటే?
ముగ్గురు వేర్వేరు నేపథ్యాలు... పెళ్లి, ప్రేమపై వేర్వేరు భావాలున్న అమ్మాయిలు ఫ్రెండ్స్ అయితే ఏం జరిగింది అనేదే ప్రధానాంశంగా ఫస్ట్ సీజన్ రూపొందించారు. యాడ్ ఏజెన్సీలో పని చేసే రీతూ (ఈషా రెబ్బా)కు పెళ్లి చేయాలని తల్లి అనుకుంటుండగా... తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. ఇక పెళ్లికి ముందే డేటింగ్‌లో ఉన్న జాహ్నవి (పాయల్ రాజ్ పుత్) అది తప్పే కాదని అంటుంది. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాని ఇందు (పూర్ణ)ను తన కంటే చిన్న వయసు ఉన్న వాడు లవ్ చేస్తాడు. ఈ ముగ్గురూ ఫ్రెండ్స్ అయితే ఏం జరిగింది? అనేదే ఈ మూవీ స్టోరీ.





















