(Source: ECI/ABP News/ABP Majha)
Poonam Pandey: ఆమె తల్లి వల్లే పూనమ్ పాండే అలా చేయాల్సి వచ్చింది - ఏజెన్సీ వివరణ
Poonam Pandey: పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయానని చెప్పి దానిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ పని చాలామందికి నచ్చలేదు. దీంతో దీనిపై వివరణ ఇవ్వడానికి ఏజెన్సీ ముందుకొచ్చింది.
Poonam Pandey Agency Statement: తాజాగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన ప్రాంక్‌కు ఒక్కసారిగా ప్రేక్షకులంతా షాక్ అయ్యారు. సర్వైకల్ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తాను ఆ క్యాన్సర్ వల్ల మరణించినట్టుగా తన టీమ్‌తో ప్రకటన చేయించింది. దీంతో అతి చిన్న వయసులో క్యాన్సర్ వల్ల చనిపోయిందంటూ ప్రేక్షకులంతా సోషల్ మీడియాలో RIP అంటూ స్టేటస్‌లు పెట్టారు. రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పూనమ్ పాండే పేరే వినిపించింది. ఉన్నట్టుండి తాను బ్రతికే ఉన్నానంటూ.. ఇదంతా కేవలం అవగాహన కోసమే అని ప్రకటించింది. అసలు పూనమ్ పాండే ఇలా ఎందుకు చేసిందో, దాని వెనుక కారణమేంటో తన టీమ్ వివరించింది.
వారికి క్షమాపణలు..
పూనమ్ పాండే తన మరణం గురించి తానే అబద్ధపు వార్తలు ప్రచారం చేసుకున్నందుకు తనపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో పూనమ్ పాండే ఏజెన్సీ అయిన ‘షిబాంగ్’ క్షమాపణలు తెలిపింది. కేవలం సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇలా చేశామని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘పూనమ్ పాండే, హాటర్‌ఫ్లై కలిసి సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నప్పుడు మేము కూడా అందులో భాగమయ్యాం. ముందుగా క్యాన్సర్‌తో బాధపడినవారు, క్యాన్సర్ వల్ల ఇష్టమైనవారిని కోల్పోయినవారు దీని వల్ల బాధపడితే వారికి మేము క్షమాపణలు తెలియజేస్తున్నాం’ అని ‘షిబాంగ్’ తెలిపింది.
కేవలం దానికోసమే..
‘మేము చేసిందంతా కేవలం సర్వైకల్ క్యాన్సర్‌కు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మాత్రమే. 2022లో ఇండియాలో 1,23,907 సర్వైకల్ క్యాన్సర్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. అందులో 77,348 మంది మరణించారు. మిడిల్ ఏజ్ మహిళల్లో ఛాతి క్యాన్సర్ తర్వాత ఎక్కువగా మరణించే వారంతా సర్వైకల్ క్యాన్సర్ బాధితులే’ అని గుర్తుచేసింది ‘షిబాంగ్’ ఏజెన్సీ. ఇదంతా పూనమ్ పాండే చేసిన పిచ్చి పనిని సమర్థించడానికే చెప్తున్నారని ‘షిబాంగ్’పై మండిపడ్డారు నెటిజన్లు. అయితే, పూనమ్ పాండే తల్లి సైతం క్యాన్సర్‌తో పోరాడిన వ్యక్తే అని రివీల్ చేసింది ఈ సంస్థ. అందుకే ఆమె అలా చేయడానికి అంగీకరించిందని పేర్కొంది.
View this post on Instagram
మీలో చాలామందికి తెలియదు..
‘మీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే పూనమ్ తల్లి కూడా క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడిన వ్యక్తే. తనకు చాలా దగ్గరయిన మనిషిలోనే ఇలాంటి సమస్యలు చూసింది కాబట్టి క్యాన్సర్‌పై అవగాహన ఎంత ముఖ్యమని పూనమ్‌కు తెలుసు. ముఖ్యంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడు దీనిపై అవగాహన మరింత ముఖ్యం’ అని రివీల్ చేసింది ‘షిబాంగ్’. కానీ ఎవరు ఎంత మద్దతునిచ్చినా కూడా పూనమ్ పాండేపై కేసు నమోదు అయ్యింది. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) తనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. చీప్ పబ్లిసిటీ కోసం పూనమ్ పాండే ఇలా చేసిందంటూ ఏఐసీడబ్ల్యూఏ ఫౌండర్ సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా మండిపడ్డారు.
Also Read: 'హనుమాన్' కోసం 75 సినిమాలను వదులుకున్నా - సంచలన విషయాలు వెల్లడించిన తేజా సజ్జా