Poonam Kaur: ఏపీ ఎన్నికల ఫలితాలపై పూనమ్ కౌర్ సటైరికల్ కామెంట్స్ - ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసింది?
Poonam Kaur Comments AP Election Results: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై నటి పూనమ్ కౌర్ సటైరికల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
Poonam Kaur Satirical Comments on AP Election Results: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపైనే (AP Assembly Election Results 2024) అంతా చర్చించుకుంటున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఫలితాలు వెల్లడయ్యాయి. సర్వేలు సైతం ఏపీ ఫలితాలను అంచన వేయలేకపోయాయి. అంతగా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. కూటమి, వైఎస్సార్‌సీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆసక్తిరంగా నిన్న వెలువడిన ఫలితా కనీసం వైస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఓటర్లు. ఈ ఫలితాలు చూసి దేశమంత అవాక్క్ అయ్యింది.
ఏపీ ప్రజలు మొత్తం కూటమికే మొగ్గుచూపారు. నిన్న జూన్ 4న వెలువడిన ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే నటి పూనమ్ కౌర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించింది. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. పూనమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ తన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలుస్తుంది. అయితే, ఎప్పుడు ఆమె పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ సటైర్స్ వేస్తుంటుంది.
Poonam Kaur Comments on AP Election: ఈ నేపథ్యంలో ఆమె ఏపీ ఎన్నికల ఫలితాలపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఎవరికి అర్థం కానీ విధంగా పోస్ట్ చేసి నెటిజన్లను డైలామాలో పడేసింది. ప్రత్యేకంగా పవన్ గెలుపుపై స్పందించలేదు. కానీ, వై నాట్ 275 అనే అంశంపై సటైరికల్‌గా కామెంట్ చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ ఫలితాలపై స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. "వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు" అంటూ ఆమె కామెంట్ చేసింది. కానీ ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందా? అని నెటిజన్లు డైలామాలో ఉన్నారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతాపై 69వేల ఓట్ల మేజారితో భారీ విజయం సాధించారు.
గతంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై (YS Jagan Mohan Reddy) ఆమె ఎన్నో సార్లు ప్రశంసలు కురిపించింది. ఆయన పాలన చాలా బాగుందని, కరోనా టైంలో ప్రజలకు కోసం అడ్డగా నిలబడ్డ నిజమైన నాయకుడంటూ కొనియాడింది. కానీ, 'వై నాట్ 175' అనే వైఎస్సార్‌సీపీ నినాదాన్ని ఆమె ఇప్పుడు సటైరికల్‌గా సంధించడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అవుతుంది. కాగా ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేతి, మాజీ సీఎం వైఎస్ జగన్ వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఈ ఫలితాల్లో ఓటర్లు వైఎస్సార్‌సీపీ అంచనాలను తలకిందుకు చేస్తూ కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు.
Also Read: పిఠాపురం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ - ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!