By: ABP Desam | Updated at : 31 Jul 2022 06:02 PM (IST)
'పోన్నియన్ సెల్వన్' సినిమాలో కార్తి
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన తారలుగా రూపొందుతున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan 1 Movie). మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా (PS1 Movie)లో తొలి పాట 'పొంగే నది' (Ponge Nadi) గ్లింప్స్ విడుదల చేశారు.
మణిరత్నం సినిమా అంటే ఏఆర్ రెహమాన్ సంగీతం కంపల్సరీ. 'పొన్నియన్ సెల్వన్'కు సైతం ఆయనే సంగీతం అందిస్తున్నారు. అంతే కాదు... ఈ పాటను ఏఆర్ రెహనా, బాంబే బకాయతో కలిసి ఆలపించారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.
ఆరు గంటలకు సాంగ్ విడుదల చేయడాని కంటే ముందు గ్లింప్స్ విడుదల చేశారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి, సంగీత దర్శకుడు రెహమాన్ ఈ గ్లింప్స్‌లో ఉన్నారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్ సాంగ్ మీద అంచనాలు పెంచింది. కార్తీ మీద ఈ పాట తెరకెక్కించినట్టు స్టిల్స్ చూస్తే తెలుస్తోంది.
Also Read : హాట్‌స్టార్‌లో 'ది వారియర్', ఆహాలో 'పక్కా కమర్షియల్', జీ తెలుగులో 'కెజియఫ్ 2' - విడుదల ఎప్పుడంటే?
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. ఈ సినిమాలో జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు
NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ
Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?
Khudiram Bose: భరత మాత ముద్దుబిడ్డ 'ఖుదీరాం బోస్' బయోపిక్, ఇదిగో టైటిల్ అనౌన్స్మెంట్
తరణ్ ఆదర్శ్ రివ్యూ: ‘లాల్ సింగ్ చడ్డా’ అలా - ‘రక్షాబంధన్’ ఇలా, బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుందా?
Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ
Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?
Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!
కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!